ఐపీఎల్ షో అదిరే!
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:14 AM
కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం క్రికెట్ అభిమానులతో సందడి నెలకొంది. క్రికెట్ ప్రేక్షకుల కోసం బీసీసీఐ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటు చేసిన ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వీక్షణకు పది వేల మంది క్రికెట్ అభిమానులు విచ్చేసినట్టు అంచనా.
కాకినాడలో క్రికెట్ సందడే..
కార్పొరేషన్(కాకినాడ), జూన్ 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం క్రికెట్ అభిమానులతో సందడి నెలకొంది. క్రికెట్ ప్రేక్షకుల కోసం బీసీసీఐ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటు చేసిన ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వీక్షణకు పది వేల మంది క్రికెట్ అభిమానులు విచ్చేసినట్టు అంచనా. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో కొంతమంది నిరాశతో వెనుదిరిగారు. వర్షం తగ్గిన తర్వాత 9.45 గంటలకు పంజాబ్, ముంబాయి జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలివచ్చి ఆనందంగా వీక్షించారు.రాజ్యసభ ఎంపీ, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్‌బాబు పట్టుదలతో ఐపీఎల్ ఫైనల్ లైవ్ స్ర్కీనింగ్ చూసే ఏకైక ఫ్యాన్ పార్క్ కాకినాడలో ఏర్పాటు చేశారు.లైవ్ మ్యాచ్ స్ర్కీనింగ్,ఎంటర్‌టైన్‌మెంట్ జో న్లు, డీజే సంగీతం, ఫుడ్‌కోర్ట్స్,కుటుంబ వినోదం ఉన్నాయి.కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పంతం నానాజీ,ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జేసీ రాహుల్ మీనా తదితరులు వచ్చారు.