Share News

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:39 AM

కోరుకొండ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నార్త్‌జోన్‌ పరిధిలో స్థానిక పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు. కోరుకొండ పోలీ స్‌స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమా వేశంలో నార్త్‌జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్‌ వివరాలను వెల్లడించారు. తమకు అందిన స

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు
క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా వివరాలు వెల్లడిస్తున్న నార్త్‌జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్‌

నలుగురి అరెస్ట్‌.. రూ.8.40 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లు, టీవీ స్వాధీనం

కోరుకొండ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నార్త్‌జోన్‌ పరిధిలో స్థానిక పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు. కోరుకొండ పోలీ స్‌స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమా వేశంలో నార్త్‌జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్‌ వివరాలను వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేర కు కోరుకొండ మండలం కాపవరంలోని ఓ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.8.40 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లు, టీవీ, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బెట్టింగ్‌కి పాల్పడుతు న్న ప్రధాన నిందితుడిగా గుర్తించిన విశాఖ పట్నానికి చెందిన రాకేష్‌ పరారీలో ఉన్నాడని.. బెట్టింగ్‌కు పాల్పడిన గోసంశెట్టి వీరప్రసాద్‌, జా జుల బాలచక్రం, నల్లల లక్ష్మీనరసయ్య, కొడతాల నానాజీని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కోరుకొండ, సీతానగరం పోలీస్‌ సిబ్బందికి రివార్డు అంద జేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ బెట్టి ంగ్‌ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయ ని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీఐ వై.సత్యకిషోర్‌, ఎస్‌ఐ కేవీ నాగార్జున, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:39 AM