Share News

వైసీపీ కార్యాలయంలో బాణసంచా సీజ్‌

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:22 AM

అనపర్తి మండలం కుతుకులూరు వైసీపీ కార్యాలయం లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా పట్టు బడింది.

వైసీపీ కార్యాలయంలో బాణసంచా సీజ్‌
పోలీసులు స్వాధీనం చేసుకున్న బాణసంచా

అనపర్తి,అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : అనపర్తి మండలం కుతుకులూరు వైసీపీ కార్యాలయం లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా పట్టు బడింది. వైసీపీ నాయకుడు, కుతుకులూరు ఉప సర్పంచ్‌ సబ్బెళ్ళ నాగిరెడ్డి ఇంట్లో వైసీపీ కార్యాలయం నిర్వహిస్తున్నారు.ఈ కార్యాలయంలో అక్రమంగా బాణసంచా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో అనపర్తి ఎస్‌ఐ శ్రీను నాయక్‌ ఆధ్వ ర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.దీంతో కార్యాలయంలో ఉంచిన బాణ సంచా నిల్వలు బయటపడ్డాయి.ఈ మేరకు సీఐ సుమంత్‌ అక్కడికి చేరుకుని అక్రమ నిల్వలను పరిశీలించారు.ఎస్‌ఐ శ్రీను నాయ క్‌ మాట్లాడుతూ బాణసంచా అక్రమ నిల్వలపై సబ్బెళ్ళ నాగిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.బాణసంచా విలువ సుమా రు రూ.1 లక్ష వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తనిఖీల్లో ట్రైనీ ఎస్‌ఐ సుజాత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ బాణసంచా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

చాగల్లు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : చాగల్లు శివారు చిక్కాలకు వెళ్లే రోడ్డుకు సమీపంలో అక్రమంగా బాణసంచా తయా రు చేస్తున్న కేంద్రంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. రాజమహేంద్రవరం నార్త్‌జోన్‌ ఏసీపీ, కొవ్వూరు ఇన్‌చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో పోలీసులు మట్టా శివన్నారాయణకు చెందిన జీడిమామిడి తోటలో దాడి చేయగా భారీ ఎత్తున బాణసంచా తయారీకి ఉపయోగించే బొగ్గు, సూరేకారం, గంధకం, తదితర సామగ్రిని మొత్తం 2,525 కేజీలు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆతుకూరి వేణుగోపాలకృష్ణ, మట్టా శివన్నారాయణ, దొనక మురళి, పల్లెల రవికుమార్‌, కోకనాటి సూరిబాబులను అరెస్టు చేశారు. పండూరి అన్నవరం పరారీలో ఉన్నట్టు తెలిపారు. ముడి సరుకు వివరాలు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Oct 18 , 2025 | 01:22 AM