ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:36 AM
కొత్తపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వెంటనే నిరుపేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి మెగా ఇళ్ల స్థలా ల కాలనీ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. తొలుత ఆనందనగరం నుంచి కొమరగిరి జగనన్న మెగా ఇళ్లకాలనీ వద్దకు వెళ్లడానికి అనుమ తి లేదని కొత్తపల్లి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులతో కలిసి సీపీఐ కార్యదర్శి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
కొత్తపల్లి మండలం కొమరగిరి ఇళ్ల స్థలాల లేఅవుట్ వద్ద నిరసన
ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
కొత్తపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వెంటనే నిరుపేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి మెగా ఇళ్ల స్థలా ల కాలనీ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. తొలుత ఆనందనగరం నుంచి కొమరగిరి జగనన్న మెగా ఇళ్లకాలనీ వద్దకు వెళ్లడానికి అనుమ తి లేదని కొత్తపల్లి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులతో కలిసి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై స్థానిక తహశీల్దార్‌ను కలిసి చర్చించేందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లస్థలాల మంజూరు కోసం కొనుగోలు చేసిన భూమిని వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై పలువురు రైతులకు కౌలుకు ఇచ్చి సాగు చేయడంపై రామకృష్ణ మండిపడ్డారు. నిరుపేదల ఇళ్లస్థలాల కోసం రైతులకు పరిహారం చెల్లించి కొనుగోలు చేసిన భూమిని కచ్చితంగా ప్రభుత్వానికే చెందుతుందన్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చర్యలు చేపట్టి పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమిని కౌలుకు ఇచ్చేందుకు సహకరించిన అధికారులపై చర్యలు చేపట్టాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నాయకులు సాకా రామకృష్ణ, తాటిపాక మధు, లోడ అప్పలరాజు, తోకల ప్రసాద్, కేశవరపు అప్పలరాజు, ఎ.భవాని, బల్ల సురేష్, కేతా గోవిందు, వి.గురవయ్య, ఝాన్సీ పాల్గొన్నారు.