గో..వ్యథ!
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:20 AM
అంబా..అంబా అని పిలిచినా ఆలకించేవారే కరువవుతున్నారు.. ఆలయంలో గోవు కనిపిస్తే మొక్కుతారు.. అదే గోవు ఇంటికి వస్తే ఛీకొడ తారు.. రోడ్డుపై బక్కచిక్కి కనిపిస్తున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడరు.. హైందవ ధర్మంలో గోవును సకల దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు.
ఎవరికీ పట్టని..ఆవేదన
గోశాలల్లో సంరక్షణ వట్టిమాటే
మేతా లేదు.. నీళ్లూ అరకొరే
ఎండిన డొక్కలు.. బేలచూపులు
గాలికొదిలేస్తున్న వైనం
దాతల సహకారమూ ‘మేతే’
రాజమండ్రిలో ఆకలి అరుపులు
కాకినాడలోనూ పస్తులే
అంతర్వేదిలోనూ ఇంతే
అన్నవరంలో చూస్తే చింతే
కన్నెత్తి చూడని అధికారులు
అంబా..అంబా అని పిలిచినా ఆలకించేవారే కరువవుతున్నారు.. ఆలయంలో గోవు కనిపిస్తే మొక్కుతారు.. అదే గోవు ఇంటికి వస్తే ఛీకొడ తారు.. రోడ్డుపై బక్కచిక్కి కనిపిస్తున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడరు.. హైందవ ధర్మంలో గోవును సకల దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. గోమాత అంటారు. ఆవు పాలను అమ్మపాలతో సమానంగా భావిస్తారు.. అంతటి ప్రాధాన్యం గోవుకు ఇస్తారు.. అందుకే పూర్వం గోవులకు ఎక్కడికక్కడ గోశాలలు నిర్మించారు.. గోవులకు దానాలు చేశారు. ఎన్ని చట్టాలుంటే ఏం లాభం.. ఎన్ని ఆస్తులుంటే ఏం లాభం.. గోవు నేడు బక్కచిక్కిపోతోంది.. ఏ గోవు బతుకు చూసినా కన్నీటి వ్యథగా మారి.. చివరకు గోవధశాలలకు తరలిపోతోంది. ఇటీవల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవుల మృతి ఆరోపణల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గోశాలల్లో గోవ్యథపై ప్రత్యేక కథనం..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న జిల్లాలోనే పెద్దది రాజమహేంద్రవరం భాస్కర్‌నగర్ శివా రు శ్రీగౌతమీ గోరక్షణ సంఘం. ఈ గోకులంలో ఉన్న 95 గోవులు దయనీయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్నాయి. గోశాలలోని నాలుగు షెడ్ల లోనూ అపరిశుభ్రతకు కొదువలేదు. బిహారుకు చెందిన ఇద్దరు పనోళ్లు ఉన్నారు. కానీ ముగ్గురు నలుగురు రోజూ ఉంటారని లెక్కలు వల్లించ డం గమనార్హం. అయినా పశువులు మాత్రం వ్యర్థాల్లోనే పొర్లాడుతున్నాయి. 1940లో శ్రీ కారు ణ్యానంద స్వామీజీ ఆపన్నులను ఆదుకోవడా నికి, గోవుల సంరక్షణకు శ్రీగౌతమీ జీవ కారు ణ్య సంఘాన్ని స్థాపించారు. అప్పట్లోనే సంఘా నికి మత్తె నారాయణమ్మ అనే దాత ఉదారంగా 15.40 ఎకరాలు ఇచ్చారు. 1972 నుంచి ఈ సం ఘం ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్లింది. జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమానికి మిగిలిన భూమిలో ఓ 4.43 ఎకరాలు గోశాలకు నామ మాత్ర లీజుతో దాఖలు పడింది. సంఘం పేరున రూ.1.20 కోట్ల వరకూ ఫిక్స్‌డ్ డిపా జిట్లు, గోరక్షణ పేటలోని షాపులు ఉన్నాయి. డిపాజిట్లపై వడ్డీ, షాపుల అద్దెల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకూ ఆదాయం సమకూరుతోంది. అయినా గోశాలలోని గోవులు ఎండిన డొక్కలతో ఎవరు వెళ్లినా తమ జీవితాలు బాగుపడతాయే మోననే ఆత్రుతతో బేల చూపులు చూస్తున్నా యి. దూడలు దయనీయ స్థితిలో కనిపిస్తున్నా యి. రెండు ఎకరాల్లో పండించిన గడ్డి ఎవరు మేస్తున్నారో తెలియదు. ఈ గోశాలకు 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.4 లక్ష లు ఇవ్వాలంటూ వాడపల్లి దేవస్థానాన్ని ఆదే శించింది. అయితే తర్వాత వైసీపీ పాలన రావ డంతో ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమ య్యాయి. మూలధనంపై వచ్చే వడ్డీనే గోశాల మనుగడకు ఆధారం. అయితే లెక్కా పత్రాలు పక్కాగా లేని పరిస్థితి. కొందరు దాతలు తాము చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా గోశాల నుంచి ఉపకారం పొందడం కూడా ఆదాయా నికి గండిగా మారింది. ఈ గోసంరక్షణ కేంద్రం చెంతనే జిల్లా ఎండోమెంట్ అధికారి, ప్రాం తీయ ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ ఉన్నా ఇక్కడి పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు.
కాకినాడలో కమిషనర్ చైర్మన్‌గా ఉన్నా ఇంతేగా!
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
నోరు లేని మూగజీవాలను పట్టించుకునే వారే కరువయ్యారు. కమిషనర్‌స్థాయి అధికారి చైర్మన్‌గా ఉన్న కాకినాడలో ఎస్‌పీసీఏ ఆధ్వ ర్యంలో నడుస్తోన్న గోసంరక్షణ కేంద్రంలో గో వులు అర్ధాకలితో అలమటిస్తూ..అవస్థలు పడు తున్నాయి. 2.7 ఎకరాల్లో ఉన్న కేంద్రంలో ప్రస్తుతం 215 వరకు గోవులు ఉన్నాయి. కబేళాలకు తరలిపోయే ఆవులను పట్టుకుని ఈ కేంద్రానికి తరలిస్తారు. ఈ కేంద్రం ప్రస్తుతం నగరపాలక సంస్థ అధికారుల అధీనంలో ఉం ది.కాకినాడ మునిసిపల్ కమిషనర్ అడహక్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇద్దరు వర్కర్లు, ఒక వాచ్‌మన్, సూపర్‌వైజర్, వెటర్నరీ డాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గోశాల స్థలాన్ని ఆనుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. వాటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణ కేంద్రం నిర్వహణకు వినియోగిస్తుంటారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న స్థలంలో 150 గోవులు ఉండాలి. కానీ అదనంగా మరో 70 పశువులను ఉంచారు. షెడ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో గోవులు కాలం వెళ్లదీస్తున్నాయి. నగరపాలక అధికారులు వాటి సంరక్షణకు సిబ్బందినైతే ఉంచారే తప్ప వాటి నిర్వహణను గాలికొదిలేశారు. మంచినీటి తొట్టెల్లో నీళ్లు లేవు. గడ్డిని ఇష్టానుసారంగా నేలపై వేసేశారు. అసలే వేసవి కాలం.. గొంతెండుతున్న రోజులివి. ఈ సమయంలో వాటి గొంతులను తడిపే వారే కరువయ్యారు. గోవులకు ఏడాదికి రూ.36 లక్ష లు ఖర్చు చేస్తున్నట్టు లెక్కల్లో చూపెడుతు న్నారు.. అక్కడి పరిస్థితి చూస్తే మాత్రం అలా లేదు. 2017 ఆగస్టులో ఈ గోశాలలో అనారోగ్య సమస్యలతో 140 వరకు ఆవులు చనిపోయా యి. కానీ అప్పట్లో ఎఫ్‌ఐఆర్‌లో 20 ఆవులనే చూపించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేం ద్రంలో అపరిశుభ్రత అలాగే ఉంది. కమిషనర్ చైర్మన్‌గా ఉన్నా నిర్వహణలో మార్పులేదు.
అన్నవరాన చింతేగా!
అన్నవరం : రత్నగిరిలోని అన్నవరం దేవస్థానం గోశాలలో గోవులన్నీ బక్కచిక్కి కనిపిస్తున్నాయి. గోసంరక్షణ ట్రస్టు నుంచే కాకుండా వీటి సంరక్షణకు దేవస్థానం ప్రధాన అకౌంట్ నుంచి నిధులు కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. గోశాలలో సుమారు 110 వరకు గోవులు ఉన్నాయి. ఆవులకు అందించే మేతను సెంట్రల్ స్టోర్స్ నుంచి గోశాలకు అందించి వాటికయ్యే వ్యయాన్ని గోసంరక్షణ ట్రస్ట్ నుంచి రికవరీ చేస్తున్నారు. రోజుకు సుమారు 30 లీటర్ల పాల ను గోశాల నుంచి తీసుకెళ్తున్నా ఈ పాలకు మాత్రం దేవస్థానం ప్రధాన అకౌంట్ నిధుల నుంచి గోసంరక్షణ ట్రస్ట్‌కు జమచేయకపోవడం విశేషం. ఇక్కడ పచ్చగడ్డిని మరింత పెంచాల్సి ఉంది. దీనికోసం దేవస్థానం డిగ్రీ కళాశాల వెనక భాగంలో సుమారు 6 ఎకరాల్లో గోసంరక్షణకు పచ్చగడ్డి పెంచాలని ఇటీవల రత్నగిరికి విచ్చేసిన అటవీశాఖాధికారి నివేదించినా అదిం కా కార్యరూపం దాల్చలేదు. గోశాలకు ఎవరైనా ఆవులు దానమిస్తే దాత నుంచి గోవుతోపాటుగా వాటి పోషణకు రూ.10,116 వసూలు చేస్తున్నా రు. వీటి నుంచే ట్రస్ట్ నిధులు సమకూరుతున్నా యి. వీటిపై వచ్చే వడ్డీతో గోసంరక్షణ చేపడుతున్నారు. గోసంరక్షణపై దేవస్థానం ఉన్నతాధికారు లు మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. గోరక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా నిరుపయోగమే.
అంతర్వేదిలో ఆకలి కేకలు
అంతర్వేది: అంతర్వేదిలోని గోశాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కనీసం గోవులకు కడుపు నిండా మేత లేని స్థితిలో అవి కొట్టుమిట్టాడు తున్నాయి.శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం అధికారులే గోశాల నిర్వహణ పర్యవేక్షిస్తారు. గోవుల సంరక్షణకు ఒక అర్చకుడు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. గతంలో అంతర్వేది ఆలయానికి ఆనుకుని పచ్చగడ్డి, ఎండుగడ్డి తగిన మంచినీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అంతర్వేది పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వ్యవసాయేతర భూములు సాగులో లేకపోవడం, పచ్చగడ్డి, ఎండుగడ్డి కొరత ఎక్కువగా ఉంది. దాతలు ముందుకొచ్చి ఎండుగడ్డి, దాణాను దానం చేయడంతో ఉన్న ఆవుల నిర్వహణ జరుగు తోంది. నెలకు రూ.లక్షా 50 వేలు ఖర్చుచేసి గోశాలను నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నా ఆ స్థాయిలో మాత్రం కనిపించ డం లేదు. అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.