Share News

గోవులను వధించి నూనె తయారీ

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:36 AM

తుని రూరల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలో దారుణం వెలుగుచూసిం ది. పవిత్రమైన గోవులను వధించే ముఠా గుట్టురట్టు అయింది. తుని కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారి ంచారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తుని సీఐ గీతా రామకృష్ణ బృందం పట్టణ శివారు రామకృష్ణా కాలనీలో గురువారం ఆకస్మిక దాడులు చేశారు. అదే ప్రాంతంలో తాండవ నదీ తీరాన ఆ నుకుని ఒక ఇంట్లో గోవుల

గోవులను వధించి నూనె తయారీ
తునిలో గో మాంసం నుంచి తీసిన కొవ్వు పదార్థాలు

తునిలో పోలీసుల దాడులు

నలుగురి అరెస్ట్‌

గో మాంసం, ఆయిల్‌ స్వాధీనం

తుని రూరల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలో దారుణం వెలుగుచూసిం ది. పవిత్రమైన గోవులను వధించే ముఠా గుట్టురట్టు అయింది. తుని కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారి ంచారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తుని సీఐ గీతా రామకృష్ణ బృందం పట్టణ శివారు రామకృష్ణా కాలనీలో గురువారం ఆకస్మిక దాడులు చేశారు. అదే ప్రాంతంలో తాండవ నదీ తీరాన ఆ నుకుని ఒక ఇంట్లో గోవులను దాచిపెట్టి వధించి ఆయిల్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. గో మాంసంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ గీతారామకృష్ణ మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో 2023లో గో మాంసం ఆయిల్‌ తయారీపై దాడి చేయగా ఇదే రీతిన గో మాంసం, ఆయిల్‌ పట్టుబడిందని కేసు నమోదు చేశామన్నారు. అదే వ్యక్తులు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలిసిందన్నారు. స్థానిక వీఆర్వో, వెటర్నరీ డిపార్టుమెంట్‌తో కలిసి దాడులు చేశా మని.. 8 టిన్నుల్లో గో మాంసం నుంచి తీసిన నూనెలు, గో మాం సం సీఐ పట్టుపడిందని తెలిపారు. మహ్మద్‌ సంసరే, మహ్మద్‌ హరీ ఫ్‌, మహ్మర్‌ ఇరీస్‌, బానేపల్లి మహేష్‌లను అదుపులోకి తీసు కుని కేసు నమోదు చేశామన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - Sep 26 , 2025 | 12:36 AM