కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
ABN , Publish Date - May 24 , 2025 | 12:30 AM
జీజీహెచ్(కాకినాడ) మే 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండంతో పాటు మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో తాజాగా ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియమాలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బోధనాసుపత్రి
వైరస్ హెచ్చరికలతో అప్రమత్తం
కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు
జీజీహెచ్(కాకినాడ) మే 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండంతో పాటు మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో తాజాగా ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియమాలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బోధనాసుపత్రి అయిన కాకినాడ జీజీహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఈఎన్‌టీ విభాగంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ వార్డును డాక్టర్ విఠల్ సందర్శించి ఏర్పాట్లపై వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. వెంటిలేటర్లు, ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సరఫరా, పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజుల లభ్యతను పరిశీలించారు. విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. రోగులను అప్రమత్తం చేయడానికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహి స్తున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 కొవిడ్ టెస్ట్‌లు చేస్తుండగా, హైరిస్క్ గ్రూపులకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలుగా కొవిడ్ టెస్టింగ్ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుగానే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ 5వేల ఎన్95 మాస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జీజీహెచ్ యంత్రాం గం పూర్తి సన్నద్ధంగా ఉంద న్నారు. పల్మనాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసన్, అనస్థీషియా వైద్య నిపుణులను బృందాలుగా చేసి నియమించామని వారు 24 గంటలూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.