Share News

సత్యవాడలో అధికారులు అప్రమత్తం

ABN , Publish Date - May 25 , 2025 | 11:48 PM

కె.గంగవరం, మే 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం సత్యవాడలో కరోనా కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్ర మత్తమయ్యారు. కార్మికశాఖమంత్రి వాసంశెట్టి సుభాష్‌, కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొ

సత్యవాడలో అధికారులు అప్రమత్తం
ప్రజల ఆరోగ్యంపై ఆరా తీస్తున్న వైద్య సిబ్బంది

కరోనా కేసు నమోదుతో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు, ఇంటింటా ఆరోగ్యంపై సర్వే

కె.గంగవరం, మే 25 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం సత్యవాడలో కరోనా కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్ర మత్తమయ్యారు. కార్మికశాఖమంత్రి వాసంశెట్టి సుభాష్‌, కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర అదేశాల తో రామచంద్రపురం సబ్‌డివిజన్‌ అధికారి డా క్టర్‌ ప్రశాంతి, పామర్రు ప్రభుత్వాసుపత్రి మెడి కల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పోలిశెట్టి హర్షిత, డాక్టర్‌ పసుపులేటి విష్ణువర్ధన్‌ ఆధ్వర్యంలో సత్యవాడ లో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇం టింటా సర్వే చేయించారు. అనారోగ్యం బారిన పడిన వారికి మందులు పంపిణీ చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ప్రతీ ఒక్కరు వ్యక్తి గత జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్‌ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ప్రతేక పారిశుధ్య నిర్వహణ నిర్వహి ంచారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. వైద్య శిబిరంలో సర్పంచ్‌ సలాది సూర్యకళావతి, ఉప సర్పంచ్‌ సలాది శ్రీనివాసు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:48 PM