పైరవీకారులు!
ABN , Publish Date - May 11 , 2025 | 12:40 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వనున్న స్వయం ఉపాధి రుణ యూనిట్లకు అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. ఎలాగైనా పథకం ద్వారా లబ్ధిపొందాలని కొందరు రాజకీయ ఒత్తిళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈ పథకం కింద కార్లు, గూడ్స్ ట్రక్కులు, ఆటోలు సబ్సిడీ, రుణం ద్వారా ఇస్తుండడంతో తమకే ఈ యూనిట్ వచ్చేలా చేయాలంటూ కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొందరు తెగ పావులు కదుపుతున్నారు. రూ. పది లక్షల యూనిట్ విభాగంలో ఇచ్చే కార్లు, ట్రక్కులు, ఆటోలకు ప్రభుత్వం నుంచి నలభై శాతం సబ్సిడీ వస్తుండడం, మరో 55 శాతం బ్యాంకు నుంచి రుణం మంజూరుకానుండడంతో తమకే రుణం వచ్చేలా చూడాలంటూ వివిధ పార్టీల నేతలను ఆశ్రయిస్తున్నారు. ఖర్చు అయినా ఫర్వాలేదని పథకా
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఎస్పీ కార్పొరేషన్ యూనిట్లకు యమా పైరవీలు
అయిదేళ్ల తర్వాత పథకం మొదలవడంతో ఎలాగైనా దక్కించుకోవాలని పాట్లు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్దకు వెళ్లి యూనిట్ల కోసం కొందరు తెగ ప్రయత్నాలు
పోటీ తీవ్రంగా ఉండడంతో ఉమ్మడి జిల్లాలో 2,732 యూనిట్లకు 13,317 దరఖాస్తులు రాక
కాకినాడ జిల్లాలో 5,498, కోనసీమ 3,265, తూర్పుగోదావరిలో 4,555 మంది పోటీ
రూ.10 లక్షల రుణం విభాగంలో ఇచ్చే కారు, గూడ్స్‌ట్రక్, ఆటోల కోసం అప్పుడే ఖర్చీఫ్‌లు
నలభై శాతం సబ్సిడీ,బ్యాంకు రుణం 55శాతం వస్తుండడంతో తెగ తాపత్రాయం
ఇదే అదనుగా రుణం వచ్చేలా చేస్తామంటూ కొందరు చోటా నేతలు కమీషన్ల వసూలు
రూ.4 లక్షలు సబ్సిడీగా వస్తుండడంతో రూ.లక్ష ఇవ్వాలంటూ దళారుల బేరాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వనున్న స్వయం ఉపాధి రుణ యూనిట్లకు అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. ఎలాగైనా పథకం ద్వారా లబ్ధిపొందాలని కొందరు రాజకీయ ఒత్తిళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈ పథకం కింద కార్లు, గూడ్స్ ట్రక్కులు, ఆటోలు సబ్సిడీ, రుణం ద్వారా ఇస్తుండడంతో తమకే ఈ యూనిట్ వచ్చేలా చేయాలంటూ కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొందరు తెగ పావులు కదుపుతున్నారు. రూ. పది లక్షల యూనిట్ విభాగంలో ఇచ్చే కార్లు, ట్రక్కులు, ఆటోలకు ప్రభుత్వం నుంచి నలభై శాతం సబ్సిడీ వస్తుండడం, మరో 55 శాతం బ్యాంకు నుంచి రుణం మంజూరుకానుండడంతో తమకే రుణం వచ్చేలా చూడాలంటూ వివిధ పార్టీల నేతలను ఆశ్రయిస్తున్నారు. ఖర్చు అయినా ఫర్వాలేదని పథకానికి ఎంపికచేయాలంటూ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారు. అటు ఇదే అదనుగా కొందరు చోటా నేతలు దరఖాస్తుదారుల నుంచి ముందే కమీషన్లు పుచ్చుకుంటూ రుణ మంజూరుకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ అయిదేళ్ల పాలనలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు పూర్తిగా మంగళం పాడేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రుణాలు ఇస్తుండడంతో పోటీ అధికంగా ఏర్పడింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం 2,732 యూనిట్లు మంజూరుకాగా ఇప్పటివరకు 13,317 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం చివరి రోజు పూర్తికావడంతో మళ్లీ గడువు పొడిగిస్తారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
నిరుపేద ఎస్సీ సామాజిక వర్గంలో యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ యూనిట్లను మంజూరు చేసింది. అర్హులైన వారికి వీటిని సబ్సిడీ, రుణం ద్వారా ఇవ్వడానికి దర ఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 32 రకాల స్వయంఉపాధి యూనిట్లు, వ్యాపారాలు చేసుకునేం దుకు వీలుగా సబ్సిడీ ప్రకటించింది. అందులోభా గంగా ఐఎస్‌బీ సెక్టార్ టైప్-1 కింద ఫ్లవర్‌బొకేలు, వర్మీకంపోస్ట్ యూనిట్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, ఎల్‌ఈడీ బల్బుల అసెంబ్లీ యూనిట్, ప్లంబింగ్, వా టర్ బాటిల్ రీసైక్లింగ్, వాటర్ రీసైక్లింగ్ యూనిట్లకు రూ.3 లక్షలు ఖర్చుకానుండగా, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. బ్యాంకు నుంచి 35శాతం రుణం, లబ్ధిదారుడు ఐదుశాతం పెట్టుబడి పెట్టాల్సి ఉంది. టైప్-2 కింద ఫిష్ ఫార్మింగ్, అడ్వంచర్ టూరిజం, సబ్బుల తయారీ, మొబైల్ కార్‌వాష్, బేకరీ, ఫ్లైయా ష్ బ్రిక్ యూనిట్, సెరికల్చర్, వెల్డింగ్, బ్యూటీపా ర్లర్, మెడికల్ ల్యాబ్ వంటి వ్యాపారాలు చేసుకునేవి ధంగా ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షలు కేటాయిం చింది. ఇందులో 40 శాతం సబ్సిడీ, 55 శాతం బ్యాం కు రుణం, ఐదుశాతం లబ్ధిదారుడి వాటా కింద ఈ యూనిట్లను ప్రకటించింది. టైప్-3 కింద రూ.10 లక్షలకంటే ఎక్కువ రుణం విభాగంలో ఈవీ బ్యాటరీ చార్జింగ్ యూనిట్ ప్రకటించింది. రవాణా రంగం విభాగంలో రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల రుణం కింద మూడు చక్రాల ప్యాసింజర్ ఈ-ఆటో, నాలుగు చక్రాల ఆటో, కారు, గూడ్స్‌ట్రక్, వ్యవసాయ విభా గంలో డ్రోన్లు రుణం కింద అందించాలని నిర్ణ యిం చింది. వీటిలో ప్రభుత్వ సబ్సిడీ 40 శాతం, బ్యాంకు రుణం 55 శాతం కింద ఉంది. ఈ నేపథ్యంలో ఈ యూనిట్లు పొందేందుకు మే 10లోగా దర ఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశిం చింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం గడచిన అయిదేళ్లలో ఎస్సీ కార్పొ రేషన్‌ను పూర్తిగా మూసేసి ఎవరికీ రుణం అనేదే మంజూరు చేయలేదు. అయితే ప్రభుత్వం మారడంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మళ్లీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ఆదేశించింది. దీంతో ఇన్నేళ్ల తర్వాత పథకం తిరిగి ప్రారంభం కావడంతో భారీగా ఆశావహులు దరఖా స్తులు చేశారు. కాకినాడ జిల్లాకు 798 యూనిట్లు మంజూరవగా శనివారం నాటికి 5,497 మంది దరఖాస్తు చేశారు. కోనసీమ జిల్లాకు 1,043 యూనిట్లకుగాను 3,265 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 891 యూనిట్లకు 4,555 మంది పోటీపడ్డారు.
సిఫార్సుల గోల..
ఇన్నేళ్ల తర్వాత పథకం అమలవుతుం డడంతో ఈ యూనిట్లను దక్కించుకునేం దుకు అప్పుడే పైరవీలు తీవ్రస్థాయిలో మొదలయ్యాయి. ఎలాగైనా తమకు పథ కం వచ్చేలా చేయాలంటూ అనేకమంది దరఖాస్తుదారులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలతో పైరవీలు చేయిస్తున్నారు. తమకు తెలిసిన నేతలను వెంటబెట్టు కుని అధికారులతో చెప్పాలంటూ తెగ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడ్డామని, ఇప్పుడు పథకానికి ఎంపికయ్యేలా చేయాలంటూ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారు. ప్ర ధానంగా రూ.10 లక్షల యూనిట్ కింద ఇవ్వనున్న కార్లు, గూడ్స్‌ట్రక్, ఆటోల కోసం పైరవీలు ఎక్కువగా నడుస్తున్నా యి. కాకినాడలో అయితే ఇప్పటికే దర ఖాస్తు రసీదుతో ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మండలస్థాయి అధికారులకు చెప్పి తమ పేర్లు నమోదు చేయించాలని ప్రదక్షిణలు చేస్తున్నారు. కోనసీమలో యూనిట్లు కొం తవరకు ఎక్కువగా ఉండడంతో గడచిన వారం రోజులుగా ఎమ్మెల్యేల వద్దకు పైర వీకారులు పరుగులు తీస్తున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం లేచిం ది మొదలు పలువురు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కారు, ట్రక్కు, ఆటో తమకే వచ్చేలా చేయాలంటూ వెంటబడుతున్నారు. దీం తో కొందరు ఎమ్మెల్యేలు చేసేదిలేక అక్క డికక్కడే అధికారులకు ఫోన్లు చేసి ఫలా నా వ్యక్తి తమవారని, కాస్త చూడండం టూ చెబుతున్నారు. ఇదే అదనుగా అధి కారుల వద్దకు సైతం కొందరు దరఖా స్తుదారులు వెళ్లి ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తి తామేనంటూ గుర్తుచేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా రంగం విభాగంలో ఇచ్చే యూనిట్ కోసం తెగ పైరవీలు చేస్తున్నారు. పథకం కింద రూ.10 లక్షల కారు తీసుకుంటే ఎలాగూ రూ.4 లక్షలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుండడంతో ఎక్కువమంది వీటికోసం తెగ పావులు కదుపుతున్నారు. అయితే అనేక నియోజకవర్గాల్లో దరఖాస్తుదారు లపై గురిపెట్టి కొందరు చోటామోటా నేతలు పథకానికి ఎంపికయ్యేలా చూస్తా మంటూ అప్పుడే సెట్టింగ్‌లు చేసుకుంటు న్నారు. రూ.4 లక్షలు ఉచితంగా వస్తున్న నేపథ్యంలో తమకు రెండు విడతలుగా లక్ష ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటు న్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేకచోట్ల ఈ తంతు నడుస్తోంది. అటు పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రూ.లక్ష ఇచ్చు కుంటే కచ్చితంగా ఎంపికవుతామని కొం దరు నమ్ముతుండడం విశేషం. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీతో చెప్పి పనిచేయిస్తామం టూ దళారులు వీరికి ఎరవేస్తున్నారు.