Share News

కలలోను!

ABN , Publish Date - May 23 , 2025 | 01:48 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్పీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా ఇవ్వ నున్న స్వయం ఉపాధి రుణ యూనిట్లకు బ్రేక్‌ పడింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ప్రభు త్వం ఆదేశించింది.

కలలోను!

కలవరింత... పెంపు మరింత

జాబితాలు నిలిపేయాలని ఆదేశం

యూనిట్లు తక్కువవడమే కారణం

కార్పొరేషన్లకు 5,137 యూనిట్లు

45,765 దరఖాస్తులు

వందల్లో ఎంపికైన లబ్ధిదారులు

అనేక మందికి దక్కని అవకాశం

ఎమ్మెల్యేలను నిలదీస్తున్న వైనం

పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి

త్వరలో భారీగా పెంచే యోచన

యూనిట్ల పెంపుపై కసరత్తు

అందుకే నిలిపివేసిన ప్రభుత్వం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్పీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా ఇవ్వ నున్న స్వయం ఉపాధి రుణ యూనిట్లకు బ్రేక్‌ పడింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ప్రభు త్వం ఆదేశించింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ, రుణం మంజూరు ఆపేయాలని సూ చించింది. త్వరలో భారీగా అదనపు రుణ యూనిట్లు, లబ్ధిదారులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

5,137 యూనిట్లు..

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కార్పొరేష న్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పేదలకు ఒక్క యూనిట్‌ కూడా మంజూరు చేయకుండా ఆపే సింది. ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఇటీవల వీటిని పునరుద్ధరించింది. సీఎం చంద్రబాబు మళ్లీ కార్పొరేషన్ల ద్వారా బీసీ, కాపు, ఎస్సీ, ఈడబ్ల్యూ ఎస్‌ వర్గాలకు స్వయం ఉపాధి యూనిట్లు మం జూరు చేయాలని నిర్ణయించారు. వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వం 40 నుంచి 60 శాతం సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణం, ఐదు శాతం వరకు లబ్ధిదారుడి వాటా కింద విభజించారు. ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా రూ.316 కోట్ల విలు వైన స్వయం ఉపాధి యూనిట్లను పేద యువ తకు అందించి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు నిర్ణయించింది. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఉమ్మడి జిల్లాకు 5,137 యూనిట్లను మంజూరు చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఏకంగా 45,765 మంది పోటీపడ్డారు. అనేకమందికి పథ కం అందని పరిస్థితి నెలకొంది. ఈ నేప థ్యం లో మళ్లీ యూనిట్లను పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని లో భాగంగా ప్రస్తుతం అర్హుల ఎంపికను నిలి పివేసి కొత్తగా మరింత మందిని ఎంపిక చేసి అందరికీ ఒకేసారి ఈ పథకం అమలు చేయ డం కోసమే తక్షణ నిర్ణయమని చెబుతున్నారు.

వందల్లో యూనిట్లు.. వేలల్లో దరఖాస్తులు

ఐదేళ్ల తర్వాత మళ్లీ పథకం అమల్లోకి రావడంతో యూనిట్లు వంద ల్లో ఉంటే దరఖాస్తుదారులు వేలల్లో వచ్చారు. బీసీ కార్పొరేషన్‌ రుణాల కింద కాకినాడ జిల్లాకు రూ.39.52 కోట్ల విలువైన 1,914 యూనిట్లు మంజూరు చేస్తే ఏకంగా 31,859 మంది, తూర్పుగోదావరి జిల్లాలో రూ.28.87 కోట్ల విలువైన 1,374 యూనిట్లకు 16,408 మంది, కోనసీమ జిల్లాలో రూ.29.54 కోట్ల విలువైన 1,394 యూనిట్లకు 15,147మంది పో టీపడ్డారు.కాపు కార్పొరేషన్‌ కింద రూ.28.24 కోట్ల విలువైన 763 యూనిట్లకు 21,454, తూర్పుగోదావరి జిల్లాలో రూ.27.15 కోట్ల విలువైన 757 యూనిట్లకు 8,193 మంది, కోనసీమ జిల్లాలో రూ.27.14 కోట్ల విలువైన 757 యూనిట్లకు 15,644 మంది పోటీ పడ్డారు. ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్‌ కింద ఉమ్మడి జిల్లాకు రూ.14 కోట్ల విలువైన 511 యూనిట్లు మంజూరు చేయగా, రూ.6 వేల మంది వరకు దరఖాస్తులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ కింద కాకినాడ జిల్లాకు 798 యూనిట్లు మంజూరవగా 5,497, కోన సీమ జిల్లాకు 1,043 యూనిట్లకు 3,265 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 891 యూనిట్లకు 4,555 మంది దరఖాస్తు చేశారు.

లబోదిబో...

ఐదేళ్ల తర్వాత పథకం అమలవుతుండడంతో యూనిట్లను దక్కించుకునేందుకు వేలాదిగా పోటీపడడంతో కేవలం వందల్లో మాత్రమే లబ్ధిదారులు రుణాలకు ఎంపికయ్యారు. ఎంపిక కాని వేలాది మంది పేద యువత, నిరుద్యో గులు తమకు న్యాయం చేయాలంటూ అనేక చోట్ల ఎమ్మెల్యే వద్దకు క్యూ కట్టారు. ఇన్నేళ్లు నిరీక్షిస్తే తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగు తుందంటూ విజ్ఞప్తులు అందించారు. దీంతో అనేక మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వందల్లో రుణ యూనిట్లు సరి పోవని వివరించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై అధికారుల ద్వారా నివేదిక రప్పించుకున్న ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా రు. ప్రస్తుతం కేటాయించిన యూనిట్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందనే చర్చ ప్రభు త్వం లో జరిగింది. రెట్టింపు చేయాలా? ఇంకా పెం చాలా? అనేదానిపై ప్రస్తుతం ఉన్నత స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ సంగతి తేల్చే వరకు ఇది వరకే ఎంపిక చేసిన లబ్ధి దారుల జాబితా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. పెంచబోయే యూనిట్లను కలిపి అందరికే ఒకేసారి పథకం వర్తింపజేయాలని జిల్లాల్లో అధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రస్తుతం మండల స్థాయిలో పథకాలకు ఎంపికై బ్యాంకు రుణాలకు ఎదురుచూస్తోన్న లబ్ధిదారులను హోల్డ్‌లో ఉంచారు. ఈ నేప థ్యంలో బీసీ కార్పొరేషన్‌ కింద మంజూరైన 1,042, ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్‌ కింద మంజూ రైన 73, కాపు కార్పొరేషన్‌ కింద ఎంపికచేసిన 570 లబ్ధిదారులను నిలిపివేశారు. త్వరలో భారీ స్థాయిలో యూనిట్లను పెంచి ఎక్కువమంది యువతకు పథకాన్ని అమలుచేయనుంది.

Updated Date - May 23 , 2025 | 01:48 AM