Share News

‘రుణం’లేదేమో..!

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:48 AM

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ కార్పొ రేషన్ల కింద నిరుద్యోగులకు ఇచ్చే స్వయం ఉపాధి యూనిట్లకు గ్రహణం పట్టింది. అప్పటి సీఎం జగన్‌ ఆనవాయితీగా వస్తోన్న రుణాల మంజూరు ప్రకియ్రను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం తరఫున స్వయం ఉపాధి పొందే అవకాశం లేక ఎందరో పేదలు నష్టపోయారు

‘రుణం’లేదేమో..!

ఐదు నెలలుగా నిలిచిపోయిన బీసీ, ఎస్పీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల రుణాలు

యూనిట్ల సంఖ్య పెంపు పేరుతో మంజూరైనవి మే నెల నుంచి నిలిపివేత

అసలెప్పుడు మంజూరవుతాయో తెలియక లబోదిబోమంటున్న లబ్ధిదారులు

అటు నియోజకవర్గాల్లో సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలూ సతమతం

ఉమ్మడి జిల్లాలో 2,405 బీసీ కార్పొరేషన్‌ యూనిట్లకు 32,448 దరఖాస్తులు రాక

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే 2,732 యూనిట్లకు 13,317 దరఖాస్తులు

నెలలు గడుస్తున్నా ఉలుకుపలుకూ లేని అధికారుల తీరుతో నిరుద్యోగుల్లో బెంగ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ కార్పొ రేషన్ల కింద నిరుద్యోగులకు ఇచ్చే స్వయం ఉపాధి యూనిట్లకు గ్రహణం పట్టింది. అప్పటి సీఎం జగన్‌ ఆనవాయితీగా వస్తోన్న రుణాల మంజూరు ప్రకియ్రను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం తరఫున స్వయం ఉపాధి పొందే అవకాశం లేక ఎందరో పేదలు నష్టపోయారు. అయితే ప్రభుత్వం మారాక మళ్లీ బీసీ, ఎస్పీ కార్పొరేషన్‌ రుణాలకు మంచిరోజులు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఆగిపోయిన రుణాలను మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించా రు. దీంతో ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ, కాపు, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి యూనిట్లను ఉమ్మడి జిల్లాకు మంజూ రు చేసింది. ఈ యూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక బాధ్య తను బీసీ, ఎస్సీ కార్పొరేషన్లకు అప్పగించింది. నిరుద్యో గులకు లాభదాయకంగా ఉంటే స్వయం ఉపాధి యూనిట్లను అధికా రులు గుర్తించి మంజూరుచేయాలని ఆదేశించింది. ఎంపికైన లబ్ధిదారు లకు యూనిట్‌ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో ప్రభుత్వం నలభైశాతం, బ్యాంకు రుణం అరవై శాతం వచ్చేలా చేయాలని అధికారులు నిర్ణయిం చారు. అందులోభాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్‌ విభాగాల్లో అధికారులు 2,405 రుణ యూనిట్లు మంజూ రుచేశారు. ఫ్లవర్‌ బొకేలు, వర్మీకంపోస్ట్‌ యూనిట్‌, వెబ్‌ సైట్‌ డెవలప్‌ మెంట్‌, ఎల్‌ఈడీ బల్బుల అసెంబ్లీ యూనిట్‌, ప్లంబింగ్‌, వాటర్‌ బాటిల్‌ రీసైక్లింగ్‌, వాటర్‌రీసైక్లింగ్‌ యూనిట్లు, ఫిష్‌ ఫార్మింగ్‌, అడ్వంచర్‌ టూరి జం, సబ్బుల తయారీ, మొబైల్‌కార్‌ వాష్‌, బేకరీ, ఫ్లై యాష్‌ బ్రిక్‌ యూ నిట్‌, సెరికల్చర్‌, వెల్డింగ్‌, బ్యూటీపార్లర్‌, మెడికల్‌ ల్యాబ్‌, మూడు చక్రా ల ప్యాసింజర్‌ ఈ-ఆటో, నాలుగు చక్రాల ఆటో, కారు, గూడ్స్‌ ట్రక్‌ ఇలా నచ్చిన వ్యాపారం ఏదైనా చేసుకునేలా దరఖాస్తు నిబంధనలు విధించా రు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందల్లో ఉన్న యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. బీసీ కార్పొరేషన్‌ పరిధిలో కాకినాడ జిల్లాకు రూ.39.52కోట్ల విలువైన 1,914 యూనిట్లకు31,859 మంది, తూర్పుగోదా వరి జిల్లాలో రూ.28.87 కోట్ల విలువైన 1,374 యూనిట్లకు 16,408 మం ది, కోనసీమ జిల్లాలో రూ.29.54 కోట్ల విలువైన 1,394 యూనిట్లకు 15,147 మంది పోటీపడ్డారు. కాపు కార్పొరేషన్‌ కింద కాకినాడ జిల్లాలో రూ.28.24కోట్ల విలువైన 763 యూనిట్లకు 21,454, తూర్పుగోదావరి జిల్లాలో రూ.27.15కోట్ల విలువైన 757 యూనిట్లకు 8,193 మంది, కోనసీ మ జిల్లాలో రూ.27.14 కోట్ల విలువైన 757 యూనిట్లకు 15,644 మం ది దరఖాస్తు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్‌ కింద ఉమ్మడి జిల్లాకు రూ.14కోట్ల విలువైన 511యూనిట్లు మంజూరవగా, ఆరు వేల దరఖా స్తులు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌ కింద కాకినాడ జిల్లాకు 798 యూ నిట్లకు 5,497, కోనసీమ జిల్లాకు 1,043యూనిట్లకు 3,265, తూర్పుగో దావరి జిల్లాలో 891 యూనిట్లకు 4,555 మంది దరఖాస్తు చేశారు. అతి కష్టంపై వీటిని పరిశీలించిన అధికారులు ఏప్రిల్‌లో బీసీ కార్పొరేషన్‌ పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వ రుణానికి ఆమోదం ఇచ్చారు. జాబితాలను బ్యాంకులకు పంపగా చాలావరకు రుణాలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇక యూనిట్లు చేతికి అందడ మే తరువాయి అనుకున్న తరుణంలో మే 8న అమరావతి నుంచి ఉన్న తాధికారులు తక్షణం యూనిట్ల మంజూరును నిలిపివేయాలని నోటి మాట ఆదేశా లు జారీచేశారు. దీంతో కంగుతిన్న లబ్ధిదారులు ఇదేంటని అధికారుల ను ప్రశ్నిస్తే కేటాయించిన యూనిట్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యం లో వీటిని త్వరలో రెట్టింపు చేయనున్నట్లు వివరించారు.

ఉలుకుపలుకూ లేదంతే...

మే8న నిలిపివేసిన స్వయం ఉపాధి యూనిట్లను ఇప్పటికీ అధికా రులు ప్రారంభించలేదు. ఒకరకంగా చెప్పాలంటే అయిదునెలల నుంచీ కనీసం వీటిపై సమాధానం కూడా ఇవ్వడం లేదు. దీంతో లబ్ధిదారులు ఈసురోమంటున్నారు. స్వయం ఉపాధి పథకానికి ఎంపికయ్యామని సంతోషిస్తే తీరా చేతికి అందినట్లే అంది చేజారిపోవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి లేకలేక మంజూరైన యూనిట్లపై లబ్ధి దారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇవి చేతికి వస్తే ఉపాధి లభి స్తుందని సంతోషపడ్డారు. కానీ అదనపు యూనిట్ల మంజూరు పేరుతో మొత్తం నిలిపివేయడంతో వీరంతా లబోదిబోమంటున్నారు. ఐదు నెల లు దాటిపోయినా అసలు ఇవి మంజూరు చేస్తారా? లేదా? అనేదానిపై జిల్లాల అధికారులకు కూడా సమాచారం లేకపోవడంతో లబ్ధిదారులకు ఏం చెప్పలేకపోతున్నారు. అటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సైతం తాజాగా ఈ తలనొప్పి పట్టుకుంది. పథకానికి ఎంపికైన లబ్దిదారులు, అదనపు యూనిట్ల కోసం చూస్తోన్న నిరుద్యోగులు సైతం ఎమ్మెల్యేలు, వారి అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవి ఎప్పుడు మంజూరవు తాయో తెలుసు కోవాలంటూ ఒత్తిడి తెస్తుండడంతో ప్రజాప్రతినిధులకు ఏం పాలుపోవడం లేదు. పైగా మంజూరైన యూనిట్లు పెంచాలని ఒత్తిడి తెచ్చింది తామే అయినా చివరకు ఉన్నవీ నెలల తరబడి ఆగి పోవడంతో సమాధానాలు చెప్పలేక గింజుకుంటున్నారు. వాస్తవానికి యూనిట్ల సంఖ్యను అధికారులు పెంచాలనుకుంటే తొలివిడత యూని ట్ల మంజూరు ప్రక్రియను పూర్తిచేసి రెండోదశ ప్రక్రియ ఆ తదుపరి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఏఇబ్బంది ఉండేది కాదు. తీరా పెంపు పేరు తో అసలుకే ఎసరు పడడంతో అంతా తలపట్టుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వం రావడంతో తమ బంధువులకు సైతం ఏదొక ఉపాధి యూనిట్‌ మంజూరు చేయించుకోవాలని భావించిన పార్టీ నేతలు, క్యా డర్‌కు నిరాశే ఎదురైంది. తాజాగా అయిదు రోజుల కిందట అమరా వతిలో సంక్షేమశాఖలపై సమీక్ష జరిగింది. యూనిట్ల పెంపు, మంజూ రుపై ఇందులో స్పష్టత వస్తుందని అంతా భావించినా ఈ ప్రస్తావన లేకపోవడంతో ఎప్పుడు మంజూరవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Oct 11 , 2025 | 01:48 AM