ఆరేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:37 AM
కలెక్టరేట్(కాకినాడ), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూ ర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కాం ట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు కాకినాడ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా అసోసి

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కాంట్రాక్టర్ల ధర్నా
కలెక్టరేట్(కాకినాడ), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూ ర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కాం ట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు కాకినాడ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌ఎస్ శాంతారామ్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. బిల్లులు చెల్లించక పోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని చెప్పారు. కొత్త పనులకు టెండర్లు వేయలేకపోతున్నామన్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించడానికి వీలుగా సీఎఫ్‌ఎంఎస్ నిధి పోర్టల్‌లో సాంకేతిక అడ్డంకులను పరిష్కరించాలన్నారు. ఆర్ అండ్‌బీ విభాగంలో రూ.1350కోట్ల నాబార్డుతో సహా వివిధ ప్రణాళికల కింద నిధుల క్లియరెన్స్ చేయాల న్నారు. అదనంగా బడ్జెట్ కేటాయింపులు లేకపో వడం వల్ల అప్‌లోడ్ చేయని బిల్లుల మొత్తం రూ. 500కోట్లు ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్ విభాగం లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు రూ.800కోట్లు ఉన్నా యన్నారు. ఇతర విభాగాల్లో రూ.5వేలకోట్ల బిల్లులు క్లియరెన్స్ చేయాల్సిఉందని శాంతారామ్ తెలిపారు. తొలుత ర్యాలీ కాకినాడ శారదాదేవి గుడి వద్ద ఉన్న మున్సిపల్ కార్యాలయం నుంచి బయలుదేరి కాకినాడ కలెక్టరేట్‌కు చేరింది. కార్యక్రమంలో అసోసి యేషన్ ప్రతినిధులు బాలకృష్ణ, ప్రకాష్‌రావు, ప్రసాద్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.