Share News

ఓట్ల చోరీతోనే బీజేపీకి అధికారం

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:23 AM

కాకినాడ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గత మూడు దఫాలుగా ఓట్ల చోరీతోనే కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీకి ఎన్నికల కమిషన్‌ కొమ్ము కాస్తోందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఽధ్వజమెత్తారు. సోమవారం ఆయన కాకినా డలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో మీడి

ఓట్ల చోరీతోనే బీజేపీకి అధికారం
కాకినాడలో మీడియాతో మాట్లాడుతున్న జేడీ శీలం

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేడీ శీలం

కాకినాడ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గత మూడు దఫాలుగా ఓట్ల చోరీతోనే కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీకి ఎన్నికల కమిషన్‌ కొమ్ము కాస్తోందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఽధ్వజమెత్తారు. సోమవారం ఆయన కాకినా డలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆగడాలు ఇం కెంతో కాలం సాగవన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీపై నిగ్గు తేల్చాలని రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు 5కోట్ల సంతకాల సేకరణ చేపట్టామ న్నారు. త్వరలోనే ఈ సంతకాల మెమోరాం డాన్ని రాష్ట్రపతి, ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పి స్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ని యంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేస్తూ ప్రజల ఓటు హక్కును దోచుకుం టోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ఎంఎం.పళ్లంరాజు, ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ పాలక్‌వర్మ, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ కామన ప్రభాకరరావు,సత్యానందరావు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:23 AM