Share News

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:14 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) ద్వారా వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపించాలని నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పి.రామలింగేశ్వర్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆయన పలువురు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు.

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు
పీజీఆర్‌ఎస్‌లో అడిషనల్‌ కమిషనర్‌కు అర్జీ అందజేస్తున్న బొగ్గారపు రస్మిత

  • పీజీఆర్‌ఎస్‌లో కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) ద్వారా వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపించాలని నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పి.రామలింగేశ్వర్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆయన పలువురు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున సంబంధిత విభాగాల అధికారులు సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వివిధ సమస్యలపై 23 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నగరానికి చెందిన బొగ్గారపు రస్మిత దివ్యాంగురాలు. ఆమెకు కేంద్ర ప్రభుత్వ పిం ఛను ద్వారా నెలకు రూ.15,000 పింఛను వచ్చేది. అయితే రాష్ట్ర ప్ర భుత్వ ఇటీవల చేపట్టిన దివ్యాంగ పిం ఛన్ల సర్వేలో భా గంగా రస్మిత పింఛన్‌ను రూ.6,000కు తగ్గించారు.పూ ర్తిగా దివ్యాంగురాలనైన తన పింఛన్‌ను రూ.15,000 నుంచి రూ.6,000కు తగ్గించారని, ఇంట్లో గడవడం ఇ బ్బంది ఉందని, పాత పింఛనను పునరుద్ధరించి తనను ఆదుకోవాలని సోమవారం ఆమె కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అడిషనల్‌ కమిషనర్‌కు అర్జీ అందజేశారు.

Updated Date - Aug 26 , 2025 | 01:14 AM