Share News

అంతర్వేదిలో ప్రముఖుల పూజలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:58 AM

అంతర్వేది, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పలువురు ప్రముఖులు పూజలు నిర్వహిం చారు. సినీ నటుడు సునీల్‌ ఆలయానికి విచ్చేయగా అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్ర

అంతర్వేదిలో ప్రముఖుల పూజలు
సినీ నటుడు సునీల్‌కు ప్రసాదం అందిస్తున్న అర్చకులు

అంతర్వేది, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పలువురు ప్రముఖులు పూజలు నిర్వహిం చారు. సినీ నటుడు సునీల్‌ ఆలయానికి విచ్చేయగా అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయంలో స్వామిని దర్శించుకున్న సునీల్‌కు వేదపండితులు మహాదాశీర్వచనం అందించారు. అనంతరం అర్చకులు స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అలాగే ఆలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టి.మాధవి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయంలో దర్శనం చేసుకున్న వారికి వేద పండితులు మహదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆలయ సహాయ కమిషనర్‌ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌ అందజేశారు. అలాగే ఆలయా నికి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమ కమిటీ సలహాదారు అనంతశయాన దీక్షితులు విచ్చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న ఆయనకు వేద పండితులు మహదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం అందించినట్టు ఆలయ ఏసీ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 12:58 AM