ఉమ్మడి జిల్లా పరిషత్ రూ.886 కోట్ల బడ్జెట్‌కు ప్రభుత్వ ఆమోదం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:10 AM
రంపచోడవరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఆయా జిల్లా పరిషత్‌ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ 2024-25 బడ్జెట్ అంచనాలను రూ.886 కోట్ల మేరకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ వివరాలిలా ఉన్నాయి. 2022-23లో వాస్తవ రాబడి రూ.44.37 లక్షలు ఉండగా, వాస్తవ వ్యయం రూ.54.47 లక్షలు

పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు
రంపచోడవరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఆయా జిల్లా పరిషత్‌ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ 2024-25 బడ్జెట్ అంచనాలను రూ.886 కోట్ల మేరకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ వివరాలిలా ఉన్నాయి. 2022-23లో వాస్తవ రాబడి రూ.44.37 లక్షలు ఉండగా, వాస్తవ వ్యయం రూ.54.47 లక్షలుగా ఉంది. 20 23-24 సవరించిన అంచనాలైతే రాబడిగా రూ.883 కోట్లు కాగా, వ్యయాన్ని రూ.882 కోట్లుగా చూపారు. ఇక 2024-25 బడ్జెట్ అంచనాలకు సంబంధించి రాబడిని రూ.886 కోట్లుగా చూపితే, వ్యయాన్ని కూడా రూ.886 కోట్లుగా చూపి అంచనా ప్రతిపాదనలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ప్రభుత్వానికి పంపించగా పలు షరతులతో ఈ ప్రతిపాదనలను ప్రభు త్వం ఆమోదిస్తూ ఉత్తర్వులను జారీ చేసి ంది. జరిపిన వ్యయాలకు సంబంధించి కచ్చితమైన లెక్కలను ఆధారాలతో చూపాలని, బడ్జెట్‌లో ఎస్సీలకు, ఎస్టీలకు ఆయా జనాభా ప్రాతిపదికన కేటాయించాల్సిన నిధుల వ్యయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా జిల్లా పరిషత్ స్థాయిలో ఐదేళ్ల వార్షిక ప్రణాళికలను జిల్లా ప్రణాళికా చట్టం ప్రకారం సిద్ధం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.