Share News

ప్రగతి పీఠిక.. అభివృద్ధి సూచిక!

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:33 AM

విశాల సముద్ర తీరం.. పోర్టులు.. నర్సరీలు.. కొబ్బరి.. అరటి.. పామాయిల్‌.. పౌలీ్ట్ర.. గ్యాస్‌ నిక్షేపాలు.. అబ్బురపరిచే పర్యాటక అందాలు.. ఇలా ఒకటేంటి ఉమ్మడి తూ.గో. జిల్లాలో అపార వనరులు ఎన్నో.. వీటిని మరింత సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధిలో ఆకాశమంత ఎత్తు

ప్రగతి పీఠిక.. అభివృద్ధి సూచిక!
కోనసీమ అందాలు..

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ విజన్‌ ప్రణాళికలో ఉమ్మడి జిల్లాకు పట్టం

కాకినాడ, కోనసీమ, తూ.గో. జిల్లాల్లో భారీ అభివృద్ధి ప్రణాళికలు

కాకినాడలో 2 వేల ఎకరాల్లో ఆక్వా పార్కు.. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి రెట్టింపు

కడియం నర్సరీలను దేశ నర్సరీ రాజధానిగా మార్చేలా ప్రతిపాదనలు

2 వేల ఎకరాల్లో పాలీహౌస్‌లు, టిస్యూ కల్చర్‌ ల్యాబ్‌లు, రోబోటిక్‌ గార్డెన్‌

సినిమా షూటింగ్‌లు, రివర్‌ క్రూయిజ్‌ ప్రోత్సహిస్తే కోనసీమకు మహర్దశ

విశాల సముద్ర తీరం.. పోర్టులు.. నర్సరీలు.. కొబ్బరి.. అరటి.. పామాయిల్‌.. పౌలీ్ట్ర.. గ్యాస్‌ నిక్షేపాలు.. అబ్బురపరిచే పర్యాటక అందాలు.. ఇలా ఒకటేంటి ఉమ్మడి తూ.గో. జిల్లాలో అపార వనరులు ఎన్నో.. వీటిని మరింత సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధిలో ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నాయి. తద్వారా ప్రజల ఆదాయం అమాంతం పెంచి అభివృద్ధి పథంలో నడిపించేందుకు మార్గాలున్నాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు దీనిపైనే దృష్టిసారించారు. కొత్తగా విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను సృష్టించి అందులో ఉమ్మడి తూ.గో.ని చేర్చారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వేటికవే ప్రత్యేకతలున్నందున ఆయా అంశాల్లో ఈ మూడు జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రత్యేక విజన్‌ ప్లాన్‌ తయారుచేశారు. 2032 నాటికి ఈ మూడు జిల్లాల్లో సమూల మార్పులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు.

కాకినాడ.. ప్రగతి జాడ..

7.4 బిలియన్‌ డాలర్ల జీడీడీపీతో 2.2 మిలి యన్‌ జనాభా ఉన్న కాకినాడ జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీరం.. ఓడరేవు, పరిశ్రమలకు నెలవు. ఈ జిల్లాను ఆయా రంగాల్లో మరింత ఎత్తుకు తీసుకువెళ్లేలా విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ ప్ర ణాళికలో ప్రస్తావించారు. ఇందులోభాగంగా 200ఎకరాల్లో తీర ప్రాంతంలో ప్రభుత్వం ఆక్వా పార్కును ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే ఇక్కడ త్వరలో 1 ఎంఎంటీపీఏ గ్రీన్‌ అమ్మోని యా ప్లాంట్‌ ఏర్పాటుకాబోతోంది. అలాగే 2 గి గావాట్ల ఎలకొ్ట్రలైజర్‌ ఉత్పత్తి చేయబోతున్నారు. తద్వారా కాకినాడ అభివృద్ధి చెందడంతోపాటు ఇక్కడ తయారయ్యే గ్రీన్‌ అమ్మోనియాలో 0.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు విదేశాలకు ఎగు మతి చేయవచ్చు. ఇక్కడున్న కేజీ బేసిన్‌ దేశం లో 35 శాతం గ్యాస్‌ అవసరాలు తీర్చుతోంది. లక్షల కోట్లు టర్నోవర్‌ జరిగే బేసిన్‌లో మున్ముం దు గ్యాస్‌, చమురు అన్వేషణ పెంచి కొత్త బ్లాక్‌ లు తవ్విస్తే రీజియన్‌ ఆర్థికంగా మరింత బలో పేతమవుతుంది. అలాగే కాకినాడ నుంచి శ్రీకా కుళం వరకు గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణం ఇప్పటికీ జరగలేదు. 20-30 ఎంఎంఎస్‌సీఎఈ సామర్థ్యం తో దీన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా ప్ర ణాళికలు రచించారు. ఇందుకు 100 నుంచి 150 మిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా. తద్వారా ఇంటింటి గ్యాస్‌ అవసరాలను రీజియ న్‌ మొత్తానికి తీర్చవచ్చు. అలాగే కాకినాడలో ప్రత్యేక గ్యాస్‌ టెర్మినల్‌ నిర్మించాలని ప్రతిపాదిం చింది. 20-30 ఎంఎంఎస్‌సీఎండీ సామర్థ్యంతో 2028-2030కి దీన్ని పూర్తి చేయాలని పేర్కొంది. ఈ రీగ్యాసిఫికేషన్‌ యూనిట్‌కు 900 మిలియన్‌ నుంచి 1 బిలియన్‌ ప్రైవేటు పెట్టుబడులు అవ సరమని పేర్కొంది. అలాగే ప్రస్తుతం కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు 26 మిలియన్‌ మెట్రిక్‌ టన్ను ల కార్గో (ఎంఎంటీపీఏ) సామర్థ్యంతో పనిచే స్తోందని, 2032 నాటికి 63 ఎంఎంటీపీఏకు సామర్థ్యం పెంచాలని పేర్కొంది. అలాగే ఇక్క డున్న ప్రభుత్వ యాంకరేజ్‌ పోర్టు సామర్థ్యం 4 నుంచి 5కి, రాబోతున్న గేట్‌వే పోర్టు సామర్థ్యం 16 ఎంఎంటీపీఏకు పెంచాల్సి ఉందని గుర్తిం చింది. అలాగే కాకినాడలో నౌకల తయారీ రంగం అంతంత మాత్రంగానే ఉందని నివేదిక పేర్కొంది. ఓ ప్రైవేటు యార్డు ద్వారా ఏటా 4 వేల నుంచి 5వేల గ్రాస్‌ టన్నుల తయారీ జరు గుతోందని, వసతులు పెంచి అదనంగా పది వేల గ్రాస్‌ టన్నుల తయారీ పెంచాలని ప్రతి పాదించింది. అలాగే జిల్లాలో ప్రైవేటు రంగంలో 5,600 ఎకరాల్లో మల్టీప్రొడక్ట్‌ పార్క్‌ ఏర్పాటుచే యాలని ప్రణాళిక సిద్ధంచేసింది. బుద్ధిస్ట్‌, ఆధ్యా త్మిక పర్యాటకాన్ని పరుగులు తీసేలా పలు సూచ నలు చేసింది. ఏటా అన్నవరం దేవాలయానికి 1 మిలియన్‌, ద్రాక్షారామ 0.2 మిలియన్‌, పిఠాపురం 0.1 మిలియన్‌ భక్తులు వస్తున్నారని, ఇది భారీగా పెరిగేలా సన్నద్ధం చేయాలని పేర్కొంది. భవిష్య త్తు అవసరాల్లో భాగంగా పారశ్రామిక రంగంలో పనిచేసే వారి అవసరాలకు 1,500 ఎకరాల్లో క్లీన్‌ టెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సిటీ ప్రతిపాదించారు. అలాగే కాకినాడ-మూలపేట బైపాస్‌ రోడ్డు, విశా ఖ-కాకినాడ 125 కి.మి. కోస్టల్‌ రోడ్డు ద్వారా అన్ని పోర్టులకు అనుసంధానం పెంచి కార్గో రవాణా భారీగా పెంచాలని వ్యూహం రచించారు.

తూ.గో.. నర్సరీల రాజధానిగా..

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మి ది జిల్లాల్లో అత్యధిక జీవీఏ ఉత్పత్తితో తూర్పుగో దావరి జిల్లా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను 2.4 బిలియన్‌ జీవీఏ నమోదుచేసింది. కాకి నాడ జిల్లా 2.2 బిలియన్‌, కోనసీమ 1.9 బిలియ న్‌గా ఉంది. వార్షిక జీడీడీపీ 6.8 బిలియన్లతో రెండు మిలియన్ల జనాభా ఉన్న ఈ జిల్లా గుడ్లు, నర్సరీ కేంద్రంగా కొనసాగుతున్న ట్టు నివేదిక గుర్తించింది. భవిష్య త్తులో ఇక్కడ ఐసీఏఆర్‌ లేదా సీ ఏఆర్‌ఐ పరిశోధన కేంద్రం ఏర్పా టు చేయాలని ప్రతిపాదించింది. కోళ్లు రకరకాల వ్యాధులు తట్టుకునే లా ఈ పరిశోధన కేంద్రం అడుగులు వేయాలని సూచించింది. అలాగే క్రూడ్‌ పామాయిల్‌ ఉత్పత్తిలో ఈ జిల్లా 15 శాతం, కాకినాడ 9 శాతంతో టాప్‌లో ఉన్నాయని వివరిం చింది. భవిష్యత్తులో ఈ ఉత్పత్తి పెరిగితే మరింత ఆదాయం వస్తుందని సూచించింది. అరటి ఉత్పత్తి కూడా ఈ జిల్లాలో అధికంగా ఉన్న నేప థ్యంలో కొవ్వూరులో హార్టికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది. నర్సరీ సాగులో ఈ జిల్లా లీడర్‌గా ఉందని దేశ నర్సరీల రంగానికి ఈ ప్రాంతం రాజధాని కానుందని విశ్లేషించింది. 5,500 హెక్టార్లలో సాగవుతున్న నర్సరీల ద్వారా ఏటా 100 మిలియన్‌ డాలర్ల జీవీఏ వస్తుండగా, 50వేల మందికి ఉపాధి లభిస్తోంది. కానీ ఎగుమ తులు 2 శాతం లోపే ఉన్నాయని, 2032 నాటికి ఎగుమతులు 15 శాతం పెంచడానికి ఆస్కారం ఉందని తెలిపింది. ఆర్నమెంటల్‌, అవెన్యూ మొ క్కల ఎగుమతికి ఆస్కారం ఉందని తెలిపింది. నర్సరీల్లో ఆధునిక పద్ధతులు వాడి జీవీఏను 2032 నాటికి 200 మిలియన్‌ డాలర్లకు పెంచే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొంది. అంటే సాగు 40 శాతం పెరగాలని తెలిపింది. 15 శాతం ఎగు మతులు పెంచితే 120మిలియన్‌ డాలర్ల వ్యాపా రం జరుగుతుందని విజన్‌ ప్రణాళికలో తెలిపింది. ఇందుకోసం 2వేల ఎకరాల్లో నర్సరీ జోన్‌లు ఏర్పా టుకు ప్రతిపాదించింది. పాలీహౌస్‌లు, టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌లు, రోబోటిక్‌ గార్డెన్‌తోపాటు శీతల గిడ్డంగుల వసతి కల్పించాల్సి ఉందని తెలిపింది. అలాగే పర్యాటక రంగం మరింత ఎదగడానికి ఈ జిల్లాకు చాలా అవకాశాలున్నాయని, పర్యాటకుల కోసం 6 నుంచి 12 గంటల వ్యవధిలో లాంగ్‌ హాప్‌-ఆన్‌ హాప్‌-ఆఫ్‌ రివర్‌ క్రూయిజ్‌ పర్యాటకం ప్రోత్సహించాలని పేర్కొంది. రాజమండ్రి-భద్రాచ లం, కాకినాడ-దిండి మార్గాల్లో టర్కీ మోడల్‌ కూ య్రిజ్‌ నడపాలని ప్రతిపాదించింది. భద్రాచలం- రాజమండ్రి లోకల్‌ సైట్‌ సీయింగ్‌, కాకినాడ-దిండి బ్యాక్‌ వాటర్‌ లీజర్‌ క్రూయిజ్‌లు నడపాలని సూ చించింది. అలాగే భవిష్యత్తులో ద్రాక్షారామ, పిఠా పురంలో 250 చొప్పున హోటల్‌ గదులు, అన్నవ రం 500 గదులు రావాలని ప్రతిపాదించింది. ఏటా జూలైలో గోదావరి యాత్ర ఏడు రోజులు, నవంబరులో ఏడు రోజులు కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని తెలిపింది.

కొబ్బరి కేంద్రం.. కోనసీమ

కొబ్బరి పంటకు కేంద్రంగా కోనసీమ జిల్లా ఉం దని నివేదికలో నీతిఆయోగ్‌ వెల్లడించింది. 5.1 బిలియన్‌ జీడీడీపీతో 1.8మిలియన్‌ జనాభా ఉన్న జిల్లా ప్రకృతి అందాలకు, గోదావరి, సముద్రం బ్యాక్‌ వాటర్స్‌కు పెట్టింది పేరని తెలిపింది. ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు రాజధానిగా జిల్లాను మార్చాలని ప్రతిపాదించింది. సముద్రం లో నాచు పెంపకంతో ఇక్కడ భారీగా ఆదాయం రాబట్టవచ్చని తెలిపింది. కోనసీమలో కోకోనట్‌ రీ సెర్చ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంచాలని సూచించింది.

పెట్టుబడులతో రండి!

కాకినాడలో నాఫ్తాకాంప్లెక్స్‌, పాలిమర్స్‌ యూనిట్‌ ఏర్పాటు చేయండి

ఎల్‌జీ కెమికల్స్‌ కంపెనీతో చర్చించిన సీఎం

షిప్‌ క్రూయిజ్‌ సర్వీసులపై కోర్డెలియాతో సంప్రదింపులు

కాకినాడలో నాఫ్తా కాంప్లెక్స్‌, పాలిమర్స్‌ కంపెనీ ఏర్పాటుచేయడానికి ముందుకు రావాలని ఎల్‌జీ కెమి కల్స్‌ కంపెనీని సీఎం చంద్రబాబు కోరారు. రెండో రోజు విశాఖలో పెట్టుబడుల సదస్సులో భాగంగా సీఎం ఎల్‌జీ కెమికల్స్‌ కంపెనీతో చర్చలు జరిపారు. యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఈ రెండింటి ని ఏర్పాటు చేసే విషయమై పరిశీలించాలని కోరారు. ప్లాస్టిక్‌ రీస్లైకింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తే అందుకు తగ్గ సహాయసహకారాలు అందిస్తామని వివరించారు. జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో కలిసి ఎల్జీ కెమికల్‌ సంస్థ ఏర్పాటు చేయదలచిన కాథోడ్‌ యాక్టివ్‌ మెటీరియల్‌ తయారీ యూనిట్‌కు సైతం సహకారం అందిస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి అనేక రకాల పరిశ్రమలు నిర్వహించడానికి ఇంధనంగా గ్యాస్‌ అవసరం. అది అందుబాటులో లేనప్పుడు నాఫ్తాతోను పరిశ్రమలను నడిపించవచ్చు. ఒకవేళ ఎల్‌జీ కంపెనీ నాఫ్తా కాం ప్లెక్స్‌ ఏర్పాటుకు సానుకూలంగా స్పందిస్తే రూ.60వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. కొరియా దేశానికి చెందిన ఎల్‌జీ కెమికల్స్‌కు పలు దేశాల్లో ఇప్పటికే నాఫ్తా కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మరో పక్క దేశంలో ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో సముద్రంలో షిప్‌ క్రూయిజ్‌ నిర్వహణలో ప్రఖ్యాతి గాంచిన కోర్డెలియా క్రూయిజ్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. కాకినాడ నుంచి విశాఖ- భీమిలికి షిప్‌ క్రూయిజ్‌ సర్వీసులు నడపడానికి కలిసిరావాలని కోరారు. కాకినాడ, విశాఖల్లో క్రూయిజ్‌ టెర్మినల్‌ సౌకర్యాలు, బీచ్‌ టూరిజం, వాటర్‌ అడ్వం చర్‌ క్రీడల నిర్వహణపై ఆసక్తి చూపుతోంది.

Updated Date - Nov 16 , 2025 | 01:33 AM