Share News

డబ్బులు వసూలు చేస్తే.. సస్పెండ్‌ చేస్తా

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:04 AM

ఎన్టీఆర్‌ భరోసా పిం ఛన్‌ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించాలని..వారి నుంచి ఎవరైనా డబ్బులు వసూళ్లు చేస్తే వెంటనే సస్పెండ్‌ చేస్తా నని కలెక్టర్‌ ప్రశాంతి హెచ్చరించారు.

డబ్బులు వసూలు చేస్తే.. సస్పెండ్‌ చేస్తా
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

నల్లజర్ల, జూలై 11 (ఆంధ్ర జ్యోతి) : ఎన్టీఆర్‌ భరోసా పిం ఛన్‌ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించాలని..వారి నుంచి ఎవరైనా డబ్బులు వసూళ్లు చేస్తే వెంటనే సస్పెండ్‌ చేస్తా నని కలెక్టర్‌ ప్రశాంతి హెచ్చరించారు. పింఛన్‌ ఇవ్వలేదని..పింఛన్‌దారుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్టు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌లో జగన్నాథపురం గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీ లన నిమిత్తం జగన్నాఽథపురం గ్రామ సచివాలయానికి విచ్చేసి రికార్డులు పరి శీలించారు.పింఛన్‌ ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఉదయం పనులకు వెళ్లే కూలీలు సచివాలయానికి వచ్చి కూర్చోవడంతో కొంత మందికి పింఛన్‌ అందించినట్టు సిబ్బంది చెప్పారు.దీనిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి పింఛన్‌ అందించాలన్నారు.పిం ఛన్లకు డబ్బు లు వసూళ్లు చేయడంపై విచారించాలని అక్కడే ఉన్న డీఆర్‌డీఏ పీడీ వీవీఎస్‌ మూర్తిని ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా 512 సచివాలయాల్లో రాని అసంతృప్తి జగన్నాఽథపురంలో వచ్చిందన్నారు.ఈ నెలలో అనపర్తి 2 సచివాలయం 100 శాతం పింఛన్‌ అందించి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు సబ్బిడీపై అందించిన పచ్చిరొట్ట విత్తనాల్లో 50 శాతం మాత్రమే మొలకెత్తా యని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు.దీనిపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసా యాధికారి మాధవరావుకు సూచించారు.కార్యక్రమంలో తహశీల్దార్‌ నాయుడు, ఎంపీడీవో సింహాద్రిరావు, నల్లజర్ల సర్పంచ్‌ పల్లి జ్యోతి,మాజీ సర్పంచ్‌ యల మాటి శ్రీనివాసరావు, నిమ్మలపూడి ప్రసాద్‌,ఏవో సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 01:04 AM