కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 166 అర్జీలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:12 AM
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి 166 అర్జీలు వచ్చాయి.
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు
166 అర్జీలు
రాజమహేంద్రవరం రూరల్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి 166 అర్జీలు వచ్చాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు రెవెన్యూ విభాగానికి సంబంధించి 79 అర్జీలు, పంచాయితీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి 29, మున్సిపల్ శాఖకు 10, హోంశాఖకు 9, వ్యవసాయశాఖకు 7, పాఠశాల విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖ, పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖలకు 32 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు బదలాయించారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కి 36 ఫిర్యాదులు
రాజమహేంద్రవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాల యంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 36అర్జీలను అడిషనల్ ఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ స్వీకరించారు. ఫిర్యాదుదారు లతో మాట్లాడి సమ స్యలపై ఆరా తీశారు. వారి సమక్షంలోనే ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా తగిన ఆదేశాలు జారీ చేశారు. చట్టపరిధిలో వెంటనే ఫిర్యా దులను పరిష్కరించాలని ఆదేశించారు.