Share News

జిల్లాలో 33 బ్లాక్‌ స్పాట్‌లు గుర్తింపు

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:24 AM

ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండ దని కలెక్టర్‌ కీర్తి చేకూరి పేర్కొన్నారు.

జిల్లాలో 33 బ్లాక్‌ స్పాట్‌లు గుర్తింపు
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కీర్తి చేకూరి, చిత్రంలో ఎస్పీ, జేసీ, కమిషనర్‌

రాజమహేంద్రవరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండ దని కలెక్టర్‌ కీర్తి చేకూరి పేర్కొన్నారు. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. జాతీయ రహదారులపై ప్రమా దాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. పెరవలి, రాజానగరం గామన్‌ వంతెన, నల్లజర్ల ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య అధికమన్నారు. రాజానగరం- కాకినాడ ఏడీబీ రహదారిపై ప్రమా దాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 33 బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయని తెలిపారు. వాటి వద్ద లైటింగ్‌, సైన్‌ బోర్డులు లేకపోవడం కూడా ప్రమా దాలకు కారణమన్నారు. పోలీస్‌, రవాణా, ఆర్‌ అం డ్‌బీ,రెవెన్యూ, ఎన్‌హెచ్‌ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తక్షణమే తనిఖీలు నిర్వహించి భద్ర త ఏర్పాట్లు చేయాలన్నారు. రాజమహేంద్రవరం లో రాత్రి వేళల్లో సరిపడా వెలుతురు లేక ప్రమా దాలు జరుగుతున్నాయన్నారు. అవసరమైన చోట్ల వీధి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. హైవేల్లోని డివైడర్ల మధ్య నుంచి అటూఇటూ దాటకుండా ఖాళీలను మూసివేయాలని ఎన్‌హెచ్‌ అధికారుల ను కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారులపై పరిమితికి మించిన వేగంతో వెళుతున్న వాహనాల వివరా లను ఎన్‌హెచ్‌ అథారిటీ వాళ్లు పోలీస్‌ శాఖకు అంద జేస్తే చలానాలు జారీ చేస్తామన్నారు. నగ ర రహదారుల్లో అక్రమణల తొలగింపునకు త్వరలో చర్యలు చేపడతామన్నారు.

మాదకద్రవ్యాలపై డయల్‌ 1972

గంజాయి తదితర నిషేధిత మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అధికారులు సమన్వయం తో పనిచేసి ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి పేర్కొన్నారు. జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. జిల్లాను పూర్తిగా గంజాయి రహి తంగా తీర్చిదిద్దడానికి అధికారుల సమష్టి కృషి అవసరమన్నారు. పోలీస్‌, ఎక్సయిజ్‌ అధికారులు తమ పరిధిలోని సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మంచి ఫలి తాలను సాధించవచ్చని చెప్పారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ గత జూన్‌ నుంచి ఇప్పటి వరకూ జిల్లా పోలీసులు, ఈగల్‌ టీమ్స్‌ సుమారు 3500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రన్నారు. 93 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గోక వరం,కోరుకొండ, సీతానగరం ప్రాంతాల్లో గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిపై నిఘా పటిష్టం చేశామన్నారు. జిల్లాలో 22 హాట్‌స్పాట్‌లను గుర్తించి నిరంతరం తనిఖీలు చేసే ఏర్పాట్లు చేశామన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల సమా చారాన్ని 1972 నెంబరుకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మేఘ స్వరూప్‌, కమిషనర్‌ రాహుల్‌ మీనా, డీపీఆర్వో లక్ష్మీ నారాయణ, ఈఎస్‌ లావణ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 01:24 AM