Share News

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:35 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ను గురువారం జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

అమలాపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ను గురువారం జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌ చాంబర్‌లో మహేష్‌కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌ మీనాకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్టాలను సమర్థవంతంగా అమలుచేయడం వంటి అంశాలతోపాటు జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై చర్చించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన ఎస్పీని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Sep 19 , 2025 | 01:35 AM