Share News

నేడు కలెక్టర్‌గా చేకూరి కీర్తి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:57 AM

జిల్లా కలెక్టర్‌గా నియ మితులైన చేకూరి కీర్తి శనివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీక రించనున్నారు.ప్రస్తుత కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆమెకు బాధ్యతలు అప్పగిస్తారు.

నేడు కలెక్టర్‌గా చేకూరి కీర్తి బాధ్యతల స్వీకరణ
చేకూరి కీర్తి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టర్‌గా నియ మితులైన చేకూరి కీర్తి శనివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీక రించనున్నారు.ప్రస్తుత కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆమెకు బాధ్యతలు అప్పగిస్తారు. విశాఖపట్నానికి చెందిన ఆమె ప్రస్తుతం ట్రాన్స్‌కో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మద్రాసులో ఐఐటీ ఉన్నత విద్య పూర్తి చేసిన ఆమె మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. మొదటి సారి 440వ ర్యాంకు , రెండోసారి 512వ ర్యాంకు, మూడో సారి 14వ ర్యాంకుతో ఆమె 2016లో ఐఏఎస్‌ సాధించారు. వృత్తిపరమైన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం గల అధికారిగా ఆమెకు పేరుంది. మొదట చిత్తూరు జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, మదనపల్లి సబ్‌-కలెక్టర్‌గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ గానూ బాధ్యతలు చేపట్టారు. అనంతరం గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం టాన్స్‌కో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రభుత్వం ఆమెను జిల్లాకు కలెక్టర్‌గా నియమించడంతో శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు మూ డో కలెక్టర్‌ ఆమె.మొదటి కలెక్టర్‌ మాధ వీలత,రెండో కలెక్టర్‌ ప్రశాంతి.ఇప్పటి వరకూ జిల్లాకు వరుసగా ముగ్గురు మహిళా కలెక్టర్లే కావడం గమనార్హం.

Updated Date - Sep 13 , 2025 | 12:57 AM