Share News

పర్యాటకానికి ఊతం హోంస్టే : కలెక్టర్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:03 AM

గ్రామీణ పర్యాటకానికి ఊతమివ్వడానికి హోంస్టే ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు.

పర్యాటకానికి ఊతం హోంస్టే : కలెక్టర్‌
అకీరా మియావాకీ మొక్కల పెంపకాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కీర్తి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి) : గ్రామీణ పర్యాటకానికి ఊతమివ్వడానికి హోంస్టే ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీఎం నారా చంద్రబాబునాయుడు రాజధాని నుంచి హోంస్టే పోస్టర్‌ను ఆవిష్కరించి, వర్చువల్‌గా కలెక్టర్‌ కీర్తితో మాట్లాడారు. హోంస్టే పర్యాటకం వల్ల స్థానికులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.జిల్లాలో ఈ విధానం విస్తరిస్తే యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. డీఆర్‌డిఏ ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి హోంస్టే రంగంలో ప్రోత్స హిస్తామన్నారు. గోకవరం మండలం వీరలంకపల్లిలో ఉన్న చింతాకిరణ్‌ హోంస్టేను మొదటిదిగా గుర్తించారు. రాజమహేంద్రవరం నుంచి 22 కిలోమీటర్లు, విమానా శ్రయం నుంచి 16 కిలోమీటర్లు, మారేడుమిల్లి- అడ్డతీగల నుంచి 42 కిలోమీటర్లు, హైవే నుంచి 100 మీటర్ల దూరంలోనే ఇది ఉందని అధికారులు చెప్పారు. అత్యాధు నికంగా తీర్చిదిద్దినట్టు నిర్వాహకుడు తెలిపారు. ఈ కార్య క్రమంలో జేసీ వై.మేఘస్వరూప్‌, డీఆర్‌వో టి. సీతా రామమూర్తి, టూరిజం ఏడీ పవన్‌కుమార్‌, జిల్లా పర్యా టక అధికారి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

అకీరా మియావాకీతో మేలు

రాజానగరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణ, వనరుల సంరక్షణలో అకీరా మియావాకి మొక్కల పెంపకం గొప్ప ఆలోచనా విధానమని కలెక్టర్‌ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజానగరం గ్రామ పంచాయతీ పరిధిలో 25 సెంట్లలో చేపట్టిన అకీరా మియావాకి మొక్కల పెంపకాన్ని, ఫామ్‌ పాంట్‌, ఎస్‌డబ్ల్యూపీసీ షేడ్‌లను శనివారం క్షేత్ర స్థాయి లో పరిశీలించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అకీరా మియావాకి మొక్కల పెంపకం అద్భుత ఆలోచనా విధానమని కొనియాడారు. అకీరా మియా వాకి మొక్కల పెంపకానికి 2970 మొక్కలు నాటడం జరి గిందని తెలిపారు. వాటిలో జామ, వెలగ, బిల్లా, మర్రి, నర్ర గిలగిల, మద్ది చెట్టు, తామర, మందార, దేవదారు, తులసి, వేప, గంధ తరగ తదితర మొక్కలు నాటడం జరిగిందని అధి కారులు కలెక్టర్‌కు వివరించారు.ఆమె వెంట డ్వామా ఏపీడీ రాంప్రసాద్‌,ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తహశీల్దార్‌ జి.అనంతలక్ష్మి సత్యవతి దేవి, డ్వామా సిబ్బంది ఉన్నారు.

ఈవీఎంలు పరిశీలన

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): సాధా రణ తనిఖీల్లో భాగంగా శనివారం ఈవీఎం గోదాములను కలె క్టర్‌ కీర్తి పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గద ర్శకాల ప్రకారం నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను భద్ర పరిచిన గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి,తనిఖీలు చేశామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీ ఎంలు నిరంతర సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయ న్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణనాయక్‌, తహశీల్దారు పాపారావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 01:03 AM