Share News

అమ్మా నాన్నలను..అనాథలను చేయవద్దు!

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:15 AM

మా ఇద్దరు కుమారులు మమ్మల్ని చూడడంలేదని.. రోజు గడవడమే కష్టంగా మారిందని వృద్ధాప్యంలో తల్లిదం డ్రు లు అధికారులను ఆశ్రయించిన ఘటన ఇది.

అమ్మా నాన్నలను..అనాథలను చేయవద్దు!
ఫిర్యాదుదారు కోలా వరలక్ష్మితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి..చిత్రంలో ఆర్‌డీవో రాణిసుస్మిత

విచారించిన కలెక్టర్‌ ప్రశాంతి

తల్లిదండ్రులను చూడడం బాధ్యత

నెలకూ రూ.5 వేలివ్వాలని ఆదేశం

రాజమహేంద్రవరం/దేవరపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : మా ఇద్దరు కుమారులు మమ్మల్ని చూడడంలేదని.. రోజు గడవడమే కష్టంగా మారిందని వృద్ధాప్యంలో తల్లిదం డ్రు లు అధికారులను ఆశ్రయించిన ఘటన ఇది. మండలంలోని యాదవోలు గ్రామానికి చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి దంపతులకు ఇద్ద రు కుమారులు.. ఇద్దరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు.వృద్ధాప్యంలో తల్లిదండ్రు లను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దంపతులిద్ద రికీ ఇబ్బందికరంగా మారింది. ఈ మేరకు తమను ఇద్దరు కుమారులు నిర్లక్ష్యం చేస్తున్నా రంటూ సీనియర్‌ సిటిజన్‌ చట్టం కింద వయోవృద్ధుల పోషణ, సంక్షేమ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. రాజమహేంద్ర వరం జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో ఆర్‌డీవో రాణిసుస్మిత ఫిర్యాదుదారులైన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి దంపతుల సమక్షంలో కేసు విష యమై కోర్టు నిర్వహించారు.గతంలో జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై సమగ్ర నివేదిక ఆధారంగా విచా రణ చేపట్టడం జరిగింద న్నారు. తల్లిదం డ్రు లను వృద్ధాప్యదశలో చూడకపోవడం దారుణ మన్నారు.ఈ రోజు వృద్ధులయ్యారని ఇలా వదిలేస్తున్నారని..పిల్లలను చిన్నతనంలో వది లేస్తే ఏమైపోయేవారని ప్రశ్నించారు. వృద్ధు లైన తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వదిలివేయ డం తగదన్నారు. ఇద్దరు పిల్లలు ప్రతి నెల రూ.5 వేలు చొప్పున చెరో రూ.2500 చెల్లించా లని ఆదేశించారు. ఇది అమలయ్యేలా చూడా లని ఆర్‌డీవోకి సూచిం చారు.వృద్ధులైన తల్లి దండ్రులను భారంగా భావించవద్దన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:15 AM