Share News

బొమ్మూరులోనే కలెక్టరేట్‌!

ABN , Publish Date - May 23 , 2025 | 01:53 AM

జిల్లా కలెక్టరేట్‌ బొమ్మూరులో ఉంటుందనే అభిప్రాయం కలెక్టర్‌ వ్యక్తం చేశారు. కలెక్టర్‌ క్యాంపు ఆఫీసులో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి గురువారం విలేకరులు అడిగిన పలు ప్రశ్న లకు స్పందించారు.

బొమ్మూరులోనే కలెక్టరేట్‌!
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు

ఇసుక డ్రెడ్జింగ్‌పై నిఘా ఉంది

జూన్‌ 21 వరకూ రోజూ యోగా

వై.జంక్షన్‌ -లాలాచెరువు సందడి

29న సెంట్రల్‌ జైలులో ప్రోగ్రాం

కలెక్టర్‌ ప్రశాంతి వెల్లడి

రాజమహేంద్రవరం,మే22(ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టరేట్‌ బొమ్మూరులో ఉంటుందనే అభిప్రాయం కలెక్టర్‌ వ్యక్తం చేశారు. కలెక్టర్‌ క్యాంపు ఆఫీసులో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి గురువారం విలేకరులు అడిగిన పలు ప్రశ్న లకు స్పందించారు. జిల్లా కలెక్టరేట్‌ శాశ్వత భవనాలు ఎక్కడ కట్టడానికి నిర్ణయించారని ఒకరు అడగ్గా.. బొమ్మూరులోని ప్రస్తుత కలెక్టరేట్‌కు అందరూ అలవాటు పడ్డారు కదా అని ఆమె చెప్పారు. గత పుష్కరాల సమ యంలో శాంక్షన్‌ అయిన సైన్స్‌ మ్యూజి యంను నిర్మించినా ఎపుడు ప్రారంభిస్తారని ఒకరు ప్రశ్నించగా అదే ఏర్పాట్లలో ఉన్నట్టు స్పష్టం చేశారు. రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం వల్ల మహనీయుల విగ్రహాలు తొలగిస్తారని, పిండాల సత్రాన్ని తొలగిస్తారట కదా అని మరొకరు ప్రశ్నించారు. రివర్‌ ఫ్రంట్‌ అభి వృద్ధిలో భాగంగా మహనీయుల విగ్రహాలను గౌరవప్రదంగా తొలగించి తర్వాత ఏర్పాటు చేస్తామన్నారు. కంబాల సత్రం గురించి ఆరా తీస్తానని తెలిపారు. ఇసుక డ్రెడ్జింగ్‌పై నిఘా ఉందని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలో 7లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ చేయడం లక్షంగా ర్యాంపులు ఇచ్చినట్టు చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలో 15 ఎకరాల భూమి ఉందని చెప్పారు. టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు ఐదె కరాల భూమితో పాటు ఓ ప్రైవేట్‌ భవనాన్ని చూశామని, ఇది గెయిల్‌, ఓఎన్‌జీసీ ,ఇతర ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుందని, అధికారుల పాత్ర తక్కువ ఉంటుందన్నారు.

యోగాపై అవగాహన పెంచండి

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 22 (ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం యోగాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై సమన్వయశాఖల అధికారులతో సమీక్షించారు. జూన్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డుస్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్‌ నుంచి లాలాచెరువు వరకూ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో మీడియా కూడా భాగస్వామ్యం కావాలన్నారు. రోజుకు ఒక శాఖ చొప్పున నెలరోజులపాటు అన్ని శాఖలు యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజల్లో యోగాపట్ల అవగాహన పెంచాలని సూచించారు. డివిజన్లలో ఆర్డీవోలు కో ఆర్డినేటర్‌గా కార్యక్రమాలు చేపడతారన్నారు.కార్యక్రమంలో జేసీ చిన్నరాముడు, జైళ్లశాఖ ఎస్‌పీ రాహుల్‌, డీఆర్‌వో సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 01:53 AM