కోనసీమలో కొబ్బరిబోర్డుకు ఏర్పాటుకు కృషి
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:59 AM
కోనసీమలో కొబ్బరి బోర్డు తోపాటు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు.
పి.గన్నవరం,డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): కోనసీమలో కొబ్బరి బోర్డు తోపాటు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీ అయిన సందర్భంలో ఈ మేరకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. యువత కు ఉపాధికోసం స్కిల్ డవలప్‌మెంట్ యూనిట్ ఏర్పాటుకు ఆలోచన చేయాలని తెలిపారని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఏడాది రన్నరకాలంలో నియోజకవర్గంలో ప్రధాన రహదారులతోపాటు జరిగి న అభివృద్ధిని పవన్‌కు వివరించానన్నారు. నదీకోత నివారణకు సహ కరిస్తానని, తొగరపాయ కాజ్‌వే నిర్మాణానికి నిధులు కేటాయింపునకు చర్యలు, రాజోలు, పి.గన్నవరం పరిధిలో ఒకచోట ఇండస్ట్రీ ఏర్పాటుకు కృషి జరుగుతోందని పవన్ తెలిపారన్నారు. డొక్కా సీతమ్మ నివాసా నికి రావాలని కోరగా పవన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.