Share News

పెంపు స్వల్పమే...

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:47 AM

అంబాజీపేట, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం కొబ్బరి మద్దతు ధరలను స్వల్పంగా పెంచింది. దేశంలో కొబ్బరి పండించే రాష్ర్టాల్లో రైతులను ఆదుకునే విధంగా నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు చేసే ధరలను స్వల్ప ంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశంలో పండించే పంటలకు మద్దతు ధర నిర్ణయిం

పెంపు స్వల్పమే...
అంబాజీపేట బహిరంగ మార్కెట్‌లో కురిడి కొబ్బరి

కొబ్బరి ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం

మిల్లింగ్‌కోప్రాకు రూ.445,

బాల్‌కోప్రాకు రూ. 400 మద్దతు ధర పెంపు

పెదవి విరుస్తున్న రైతులు

అంబాజీపేట, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం కొబ్బరి మద్దతు ధరలను స్వల్పంగా పెంచింది. దేశంలో కొబ్బరి పండించే రాష్ర్టాల్లో రైతులను ఆదుకునే విధంగా నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు చేసే ధరలను స్వల్ప ంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశంలో పండించే పంటలకు మద్దతు ధర నిర్ణయించేందుకు ఏటా డిసెంబరులో ఆయా రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో కేంద్రప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశం అనంతరం మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెడుతుంది. కేబినెట్‌ ఆమోదించిన అనం తరం పంటలపై మద్దతు ధరలను ప్రకటిస్తుం ది. దీనిలో భాగంగా కొబ్బరికి స్వల్పంగా మద్దతు ధరలను పెంచుతూ కేబినెట్‌ ఆమోదించింది. 2026 సంవత్సరానికి సంబంధించి మిల్లింగ్‌ కోప్రా గతేడాది కంటే రూ.445 పెంచి రూ.12, 100, బాల్‌కోప్రా రూ.400 పెంచి 12, 500గా నిర్ణయించి ంది. 2026లో ఆ యా రాష్ట్రాల్లో నాఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు, బహిరంగ మార్కెట్లలో ఈ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మా ర్కెట్లో కొబ్బరి ధరలు మిల్లింగ్‌కోప్రా క్వింటాళ్లు రూ18.వేలు, బాల్‌కోప్రా క్వింటాళ్లుకు రూ.28వేలు పైబడి ఉండడంతో ఇప్పుడు నాఫెడ్‌ కేంద్రా లు తెరిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని రై తులు వాపోతున్నారు. పెంచిన ధరలపై పెదవి విరుస్తున్నారు. కొబ్బరి కనీస మద్దతు ధర రూ. 30వేలు పైబడి ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధరలను పెంచాలని భారతీయ కిసాన్‌సంఘ్‌సభ్యులు కోరుతున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:47 AM