‘అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం కోకో రైతుల ఉద్యమం’
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:17 AM
నిడదవోలు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సమావేశంలో సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలోఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల కాశీ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రా
నిడదవోలు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సమావేశంలో సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలోఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల కాశీ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంత ర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకోగింజలకు రూ.870 ధర ఉండగా రాష్ట్రంలో మాత్రం కోకో గింజల కొనుగోలు కం పెనీలు రూ.450 మాత్రమే ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకు రూ.50 సబ్సిడీ ఇస్తున్నా గిట్టుబాటు కావడం లేదన్నారు. రాష్ట్రంలోని కోకో రైతులంతా సంఘటితమై తమ డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తామన్నారు. ఈ సదస్సులో బోళ్ళ వెంకట సుబ్బారావు, కోనేరు సతీష్‌బాబు, రాయల కాశీబాబు, మట్టపర్తి చంద్రరావు, శ్రీను, సింహాద్రి రామకృష్ణ, గన్నమని ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.