ఇన్నోవేటివ్‌గా ఆలోచించండి.. సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:20 AM
గ్రామస్థాయి నుంచి ఇన్నోవేటివ్‌గా ఆలోచించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడదామని సీఎం చంద్రబాబు సూచించారు.

డీవీఏపీ యూనిట్ ప్రారంభం
వర్చువల్‌గా చేసిన సీఎం చంద్రబాబు
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాపై సమీక్ష
ప్రణాళిక రూపొందిస్తామన్న మంత్రి
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 9( ఆం ధ్రజ్యోతి): గ్రామస్థాయి నుంచి ఇన్నోవేటివ్‌గా ఆలోచించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడదామని సీఎం చంద్రబాబు సూచించారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం తూర్పుగోదావరి జిల్లా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయం (డీవీఏపీ యూనిట్)ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించి మాట్లా డారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సమస్య ఉందని వాటన్నింటిని వెలికి తీయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో వనరులు సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత అంశాలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గ, మండల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు చేయాలన్న సీఎం సూచనలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విద్యార్థుల ద్వారా ప్రతిపాదించే నూతన ఆవిష్కరణలకు ఆర్థిక, సాంకేతిక చేయూతనిచ్చే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏపీ యువతకు వరం అన్నారు.రాజానగరంలో 300 ఎకరాల్లో ఇండస్ర్టీయల్ పార్క్ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందన్నారు.ఏపీలో పర్యాటకరంగ అభి వృద్ధికి అవకాశం ఉందన్నారు.వీడియోకాన్ఫరెన్సలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు.