సీఎంగారూ.. ఇదీ సమస్యల తీరు!
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:55 AM
కాకినాడ జిల్లాను ఎన్నో ఏళ్లుగా పలు కీలక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురై నిధులు మం జూరవక పరిష్కారం కోసం ఎదురుచూస్తు న్నాయి. వీటిని పట్టాలెక్కించి నిధులు విడుదల చేస్తేనే వాటికి మోక్షం.
నేడు సీఎం చంద్రబాబు పర్యటన
తీసుకెళ్లేలా కలెక్టర్ నివేదిక
జీజీహెచ్‌కు రూ.500 కోట్లకు వినతి
స్మార్ట్‌సిటీకి రూ.186 కోట్లు కావాలి
జయలక్ష్మి బాధితులకు న్యాయం
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
కాకినాడ జిల్లాను ఎన్నో ఏళ్లుగా పలు కీలక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురై నిధులు మం జూరవక పరిష్కారం కోసం ఎదురుచూస్తు న్నాయి. వీటిని పట్టాలెక్కించి నిధులు విడుదల చేస్తేనే వాటికి మోక్షం. అయితే సీఎం చంద్రబాబుకు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక ప్రేమ ఉన్న నేపథ్యంలో వీటి పూర్తికి నిధులు విడుదల చేస్తారని అంతా ఆశిస్తున్నారు. నేడు సీఎం పెద్దాపురం పర్యటనకు వస్తుండడంతో ఆయన దృష్టికి పలు కీలక సమస్యలను తీసుకువెళ్లి నిధులు కోరేందుకు జిల్లా కలెక్టర్ శాన్‌మోహన్ నివేదిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏలేరు ఆధునికీకరణ, ఉమ్మడి తూ.గో.జిల్లాకు కీలక మైన జీజీహెచ్ అభివృద్ధి, కాకినాడ స్మార్ట్‌సిటీకి నిధుల బెంగ తీర్చడం, ఉప్పాడ సముద్రపు కోత నివారణ, జయలక్ష్మి సొసైటీ ఆస్తులను వేలం వేయించి డిపాజిటర్లకు న్యాయం చేయడం వంటి పలు ప్రధాన అంశాలను పర్యటనలో సీఎంకు వివరించనున్నారు. అటు ముఖ్యమంత్రి కూడా నేటి పర్యటనలో జిల్లాకు వరాలు కురి పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఫ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పేదలకు పెద్దదిక్కు జీజీహెచ్‌లో ప్రధాన భవనాలు శిథిలస్థితికి చేరుకున్నాయి. విని యోగానికి పనికిరావని ఇంజనీర్లు అనేక సార్లు నివేదిక లిచ్చినా నిధుల్లేక అదే భవ నాల్లో వైద్యసేవ లందిస్తున్నారు. కొత్త బ్లాకుల నిర్మాణానికి రూ.500 కోట్లు నిధులివ్వాలని కలెక్టర్ కోరబోతు న్నారు.
ఫ కాకినాడ స్మార్ట్‌సిటీకి ఏటా కేంద్రం రూ.100 కోట్ల నిధులిస్తుంది. అదే స్థాయిలో రాష్ట్ర ప్ర భుత్వం తన వంతు ఏటా ఇంకో రూ.100 కోట్లు సమకూర్చాలి. కానీ గత వైసీపీ ఈ నిధులను విడుదల చేయకుండా స్మార్ట్‌సిటీని ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో స్మార్ట్‌సిటీ దివాళా స్థితిలో ఉం ది. అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా రూ.186 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా ఇవి విడుదల కాలేదు.ఈ నిధులు విడుదల చేస్తే అభివృద్ధి పనులు వేగవంతమ వుతాయి.
ఫ కాకినాడ కేంద్రంగా జయలక్ష్మి సొసైటీ బ్యాంకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.520 కోట్ల మేర డిపాజిటర్లను మోసం చేసింది. దీంతో సీఐడీ రంగంలోకి దిగి సంస్థ ఆస్తులను సీజ్ చేసింది.కానీ ఇప్పటికీ బాధి తులకు న్యాయం జరగలేదు. సీజ్ చేసిన రూ.450 కోట్ల విలువైన ఆస్తుల్లో కొంతైనా వేలం వేసి చిన్న డిపాజిటర్లకు డబ్బులు చెల్లించే వీలున్నా సీఐడీ కనీసం ఆ దిశగా ప్రయత్నం చేయకపో వడంతో బాధితులు అల్లాడుతున్నారు.కనీసం 40 శాతమైనా నష్టపోయిన వారికి చెల్లించడానికి రూ.200 కోట్లు మంజూరు చేయాలని కలెక్టర్ శాన్ మోహన్ సీఎంను కోరనున్నారు.
ఫ కాకినాడ ఉప్పుటేరుపై సుమారు ఏడేళ్ల కిందట శంకుస్థాపన చేసిన మూడో వంతెన నిర్మాణంపై ఇప్పటికీ కలగానే మిగిలింది. కాకినాడలో వాహనాల రద్దీ తగ్గించేందుకు పాత పోర్టు రైల్వే స్టేషన్ నుంచి ఏటిమొగ మీదుగా యానాం రోడ్డుకు కలిసేలా ఉప్పుటేరుపై రూ.146 కోట్లతో మూడో వం తెన నిర్మాణానికి 2018 నవంబర్ 26న శంకు స్థాపన చేశారు.ఆ తర్వాత వైసీపీ అధికా రంలోకి రావడంతో నిర్మాణం మూలన పడింది. ఏడీబీ రోడ్ నుంచి పోర్టు మీదుగా ఎన్‌హెచ్ 216 రహదారికి కలిసే ఈ వంతెన నిర్మాణం వల్ల నగరంలో వాహనాల రద్దీ తగ్గనుంది. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణా నికి నిధులు మంజూరు కోరుతూ కలెక్టర్ తన నివేదికలో ప్రస్తావించారు.
ఏలేరుతోనే మోక్షం...
గతేడాది ఏలేరు వరద లతో తొమ్మిది మండలాల్లో కాలువలకు 60 చోట్ల గండ్లు పడ్డాయి. కేవలం పదివేల క్యూసెక్కుల వరదను మాత్రమే తట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న కాలువల్లోకి 47వేల క్యూసెక్కుల వరద వచ్చి పడడంతో తొమ్మిది మండలాలు నష్ట పోయాయి. ఏలేరు వరద కారణంగా 34,812 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం ది. మొత్తం 24,879 మంది రైతులు నష్టపో యారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం ఏలేరు ఫేజ్1 పూర్తికి రూ.142 కోట్లు, ఫేజ్2 పూర్తికి 150 కోట్లు ఇస్తానని మోసగించింది. ఈలోపు సవరించిన అంచనాలు రూ.663 కోట్లకు చేరుకున్నాయి.గతేడాది సీఎం చంద్ర బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు నిధులు ఇస్తా మని హామీ నేపథ్యంలో నిధులు మంజూ రు చేయాలని కలెక్టర్ కోరబోతున్నారు.
సముద్రం కోత..
ఉప్పాడ వద్ద సముద్రం అంతకంతకూ ముందుకు వస్తూ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు సముద్రగర్భంలో 1,360 ఎకరాలు కలిసిపోయింది.ఈ నేపథ్యంలో కోతను నివారి స్తామని ఎన్నికలప్పుడు కూటమి హామీ ఇచ్చి ంది.ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ స్వయంగా కోతను పరిశీలించారు. ఎన్‌సీఆర్‌సీ శాస్త్రవేత్తలతో ప్రత్యేక అధ్య య నం చేయించారు.కోత నివారణకు ప్రత్యేక కాంక్రీట్‌గోడ నిర్మించాలని వీరు తేల్చారు. 12 కిలోమీటర్ల మేర ఈ కోత నివారణ ప్రణా ళి కకు రూ.250 కోట్ల వరకు వ్యయం అవు తుందని అంచనావేశారు.ఈ నేపథ్యంలో కోత నివారణ పనులు ప్రారంభించ డానికి నిధు లు మంజూరు చేయాలని కలెక్టర్ తన నివేదికలో ప్రస్తావించారు.ఇప్పటికే కేంద్రం సైతం నిధులు ఇవ్వడానికి దాదాపు నిర్ణయా నికి వచ్చింది.దీంతో ఆ ప్రతిపాదనలు వే గంగా కదిలేలా సీఎంకు విన్నవించనున్నారు.