Share News

నేడు నల్లజర్లకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:39 AM

సీఎం చంద్రబాబు రాకకు నల్లజర్ల ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

నేడు నల్లజర్లకు సీఎం చంద్రబాబు
నల్లజర్లలో సీఎం పాల్గొననున్న రైతన్న - మీకోసం సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లపై చర్చిస్తున్న ఎమ్మెల్యే వెంకటరాజు

రాజమహేంద్రవరం/సిటీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రాకకు నల్లజర్ల ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 10.30గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలి కాప్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు నల్లజర్లలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11.10 గంటలకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.30గంటలకు నల్లజర్లలో వ్యవ సా య భూమి పరిశీలనకు వెళ్తారు. 11.30 నుంచి 11.50 వరకూ స్టా ల్స్‌ను సందర్శిస్తారు. కలెక్టర్‌ స్వాగత ప్రసంగం చేస్తారు. 12.15 నుంచి 12.20 వరకూ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంక ట్రాజు ప్రసంగిస్తారు. సీఎం చంద్రబాబు 12.55 గంటల వరకూ 1000 మంది రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వేదికపై ఏర్పాటు చేసిన మంచంపై కూర్చుని రైతులు, వారి కుటుంబాల తో కూడా మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడ తారు. తర్వాత మధ్యాహ్నం 1.30 గంటల వరకూ విశ్రాంతి తీసు కుంటారు. 1.45 నుంచి 3.15 గంటల వరకూ గోపాలపురం నియో జకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయం త్రం 3.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 3.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉండవల్లి వెళ్తారు. కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లా డు తూ పెద్దసంఖ్యలో రైతులు పాల్గొంటున్న నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజావేదిక వద్ద ఐదు స్టాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. సభలో రైతులు, వ్యవసాయం, హార్టీకల్చర్‌, మత్స్య శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల ను ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీకే అశోక్‌కుమార్‌, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ పరిశీలించారు. 1200మందితో బందోబస్తు ఏర్పాటు చేసి నట్టు ఎస్పీ తెలిపారు. పర్యటన సజావుగా సాగేలా సభావేదిక, హెలిప్యాడ్‌ తదితర ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు, భద్రత చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌, ఎమ్మెల్యే మద్ది పాటి వెంకట్రాజు, జేసీ వై.మేఘ స్వరూప్‌, ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్‌ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు.

Updated Date - Dec 03 , 2025 | 01:39 AM