నేడు సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:11 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం తాళ్లపూడి మండలం మలకపల్లిలో పర్యటించనున్నారు.
రాజమహేంద్రవరం/ తాళ్లపూడి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం తాళ్లపూడి మండలం మలకపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామంలో మొదట చర్మకార కార్మికుడికి సామాజిక పింఛను పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో పాల్గొని పీ4 కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. కొవ్వూరు మండలం కాపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11 గంటలకు చేరుకుంటారు. ఐదు నిమిషాలపాటు ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి కారులో బయ లుదేరి రోడ్డు మార్గాన 11.15 గంటలకు తాళ్లపూడి మండలం మలకపల్లి చేరుకుం టారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తారు. అనంతరం 11.40 నుంచి 1.10 వరకూ మలకపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కాపవరంలో ఏఎంసీకి చేరుకుని మధ్యాహ్నం 1.20 గంట నుంచి 2 గంటల వరకూ అక్కడ ఏర్పాటుచేసిన కార్‌వాన్‌లో విశ్రాంతి తీసుకుం టారు. తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకూ పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరు కుంటారు. కాపవరం నుంచి హెలికాప్టర్‌లో 3:40 గంటలకు బయలుదేరి 4:10 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.
నేడు పీ4కు శ్రీకారం
తూర్పులో 66,474 మంది నిరుపేదలు గుర్తింపు
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మలకపల్లిలో ఇద్దరికి దత్తత
రాజమహేంద్రవరం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : నిరుపేద కుటుంబాలకు సాయం చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పీ4 సర్వే చేయించిన సంగతి తెలిసిందే. దత్తత తీసుకునేవారిని మార్గదర్శకులుగా పరగణిస్తూ.. ఉన్నతస్థితిలో ఉన్నవారిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది ముందుకు వచ్చినట్టు సమాచారం. జిల్లాలో పి4 సర్వే కింద 66,474 మంది నిరుపేదలు ఉన్నట్టు గుర్తించారు. ఆయా కుటుంబాలకు దాతల సాయంతో తోడ్పాటు అందిస్తారు. కొవ్వూ రు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగ ళవారం సీఎం చంద్రబాబునాయుడు పి4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా రెండు కుటుంబాలను ఇద్దరికి దత్తత ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కొందరితో ముఖాముఖీ మాట్లాడతారు. జిల్లాలో మండలాల వారీ పి4 కుటుంబాల వివరాలిలా ఉన్నాయి. అనపర్తిలో 1429, బిక్క వోలులో 2639, చాగల్లులో 2009, దేవరపల్లిలో 3919, గోకవ రంలో 2966, గోపాలపురంలో 3445, కడియంలో 3367, కోరుకొండలో 2594, కొవ్వూరు రూరల్‌లో 2860, కొవ్వూరు అర్బన్‌లో 800, నల్లజర్లలో 3998, నిడదవోలు రూరల్ 2175, నిడదవోలు అర్బన్ 9280, రాజమహేంద్రవరం రూరల్ 5579, రాజానగరం 6041, రంగంపేట 3205, సీతానగరం 3064, తాళ్లపూడి 1417, ఉండ్రాజవరం 2346 కుటుంబాలు ఉన్నాయి.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు : మంత్రి దుర్గేష్
కొవ్వూరు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఏర్పాట్లను సోమవారం మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఆర్డీవో రాణిసుస్మిత పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయంలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రశాంతి, జేసీ ఎస్.చిన్నరాముడు, ఆర్.కృష్ణనాయక్, అదనపు ఎస్పీ ఎం. మురళీకృష్ణ, సుబ్బరాజు, డీఎస్పీ జి. దేవకుమార్ పాల్గొన్నారు.
650 మందితో బందోబస్తు : ఎస్పీ
రాజమహేంద్రవరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్ర బాబు పర్యటన సందర్భంగా మలకపల్లిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్పీ నరసింహ కిశోర్ తెలి పారు. మొత్తంగా 650 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామ న్నారు. పోలీసుల సూచనల మేరకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భద్రతాపరంగా ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు మురళీకృష్ణ, సుబ్బరాజు, అర్జున్, చెంచిరెడ్డి పాల్గొన్నారు.