బంగారు కుటుంబాలు 27,311
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:38 AM
జిల్లాలో 27,311 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది.
అమరావతిలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సదస్సు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి )
జిల్లాలో 27,311 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. జిల్లాలో 3843 మంది సచివాలయాల సిబ్బందితో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటి వరకూ 0.1 శాతమే అనుసంధానం జరిగింది. మార్గదర్శులను భాగస్వామ్యం చేసి జిల్లా కలెక్టర్ ఈ స్కీమ్‌ను వేగవంతం చేయాలన్నారు. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాకు సంబంధించిన పలు నివే దికలు సమర్పించారు. హైదరాబాద్- విశాఖ పట్నం మధ్యలో 72 కిలోమీటర్ల దేవరపల్లి -ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రస్తావించారు. సోలార్ పథకం 24,368 మంది ఎస్సీ, ఎస్టీలకు 92,928 మంది బీసీలకు, 4,387 మంది ఇతరులకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచడానికి 6 కంపెనీలతో ఒప్పందం జరిగింది. కేబినెట్‌లో మరో కంపెనీ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. జిల్లావ్యాప్తంగా 49 జాబ్ ఫెయిర్లు నిర్వహించడం లక్ష్యంగా పెట్టు కున్నా 60 నిర్వహించారు. 83 పరిశ్రమలు పాల్గొ న్నాయి. 6312 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కౌశలం పథకం కింద ఇంటి నుంచే పనిచేసే విధంగా విద్యావంతులకు శిక్షణ, ఉపాధి అవ కాశాలు కల్పించనున్నారు.జిల్లాలో 88,075 మంది అభ్యర్ధులు ఉన్నారు.అందులో 60,855 మందికి అవకాశం ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఇప్పటి వరకూ 15,991 మందిని షెడ్యూల్ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా టార్గెట్ సాధించిన 6 జిల్లాల్లో తూర్పుగోదావరి కూడా ఉంది. వాహనాల ద్వారా రెవెన్యూ కలెక్షన్ చేయ డంలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ రెవెన్యూ కంట్రిబ్యూషన్‌లో మాత్రం వెనుకబడి ఉంది. ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో నాల్గో స్థానంలో ఉంది. రూ.92.01 కోట్లు వసూళ్లు లక్ష్యం కాగా రూ.51.99 కోట్లు వసూలు చేసింది. ఇది 56.50 శాతం. ఇక రెవెన్యూ టాక్స్ డిమాం డ్‌ను పెంచడంలో బాగా దిగువ స్థాయిలో ఉన్న మూడు జిల్లాల్లో ఒకటిగా ఉంది. టార్గెట్ రూ.12.29 కోట్లు కాగా కేవలం 3.82 మాత్రమే సాధించింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కింద జిల్లాలో 1469 అనధికార భవనాలు గుర్తించారు. అందులో ఇప్పటి వరకూ 124 దరఖాస్తులు అందాయి. రూ.12.4 లక్షల ఆదాయం వచ్చింది. లేఅవుట్ రెగ్యురైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద జిల్లాలో 7461 దరఖాస్తులు రాగా రూ.61.61 కోట్లు ఆదాయం వచ్చింది. నీటి పన్ను వసూళ్లలో జిల్లా ఏడో స్థానంలో ఉంది. 26.64 కోట్లు టార్గెట్ కాగా 5.30 కోట్లు సాధించారు. స్వమిత్వ సర్వే కింద జిల్లాలో 102 గ్రామాలు సర్వే లక్ష్యంకాగా ఇప్పటి వరకూ 91 గ్రామాలు పూర్తి చేశారు. 11 పెండింగ్‌లో ఉన్నాయి. మైన్స్ డిపార్ట్‌మెంట్ కలెక్షన్ విషయంలో జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లా జీవీఎలో 13.6 శాతం భాగస్వామ్యం ఉంది. జీఎస్టీ వసూళ్లలో 9వ స్థానంలో ఉంది. ఉచిత ఇసుక విధానం వల్ల జిల్లాలో అక్టోబరులో 68 శాతం మంది, నవంబరులో 61 శాతం, డిసెం బరులో 78 శాతం సంతృప్తిని వ్యక్తం చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.