Share News

జిల్లాలో అశాంతి..అభద్రత వద్దు!

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:36 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేయడంతో పాటు జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సమీక్షించారు.

జిల్లాలో అశాంతి..అభద్రత వద్దు!
అమరావతిలో మంగళవారం రెండో రోజు జరిగిన కలెక్టర్‌, ఎస్పీల సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్యం కావాలి

పథకాలు వేగవంతం చేయాలి

15 శాతం వృద్ధి రేటు ఉండాలి

ఎస్పీలు రాజీపడొద్దు

పోలీసులు అప్రమత్తం కావాలి

సాగు విధానంలో మార్పు రావాలి

విమానాశ్రయంలో కార్గో టెర్మినల్‌

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 16 (ఆం ధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేయడంతో పాటు జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సమీక్షించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా జిల్లాలో ఎవరైనా కలెక్టర్‌ ఒక ప్రాజెక్టు చేపట్టి ప్రశంసలు అందుకుంటే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎస్పీలు రాజీపడకుండా సమర్థవంతంగా సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. మహిళల పట్ల అత్యాచారాలు, పిల్లల కిడ్నాప్‌లు, గంజాయి మత్తులో యువత చేస్తున్న అరాచకాల వంటి అంశాలపై జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం దారుణంగా నష్టపోయింది. వృద్ధి రేటుపై పనిచేయడంతో పాటు స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనకు మానవ వనరులను సమృద్ధిగా ఉపయోగించాలన్నారు. నేను, పవన్‌కల్యాణ్‌ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాం. 30 శాతం క్రైమ్‌ రేటును తగ్గించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయాలని, సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. ఒక కుటుంబం-ఒక వ్యాపారవేత్త నినాదంతో ముం దుకెళ్లాలని సీఎం ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా అధిక నీటి పారుదల సామర్థ్యం ఉంది. లైవ్‌ స్టాక్‌ ఉత్పత్తి ఉంది. ఆయిల్‌ఫామ్‌, వరి, కోకో వంటి అతి విలువైన పంటల సాగు ఉంది. జిల్లాలో 38 పరిశ్రమలు ఉన్నాయి. రాజమ హేంద్రవరం విమానాశ్రయంలో కొత్త కార్గొ టెర్మినల్‌ నిర్మాణం కూడా జిల్లాకు బలమేనని స్పష్టం చేశారు. బలహీనతలు అంటే జిల్లాలో సాంప్రదాయ పంటలను పరిమిత రకాలతోనే పండిస్తున్నారు. నీటిపారుదల పద్ధతులు పేల వంగా ఉన్నాయి. నేల సంరక్షణ తీరు బలహీ నంగా ఉంది. పంటలు కోసిన అనంతరం వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, మార్కెట్‌ అవకాశాలు లేవని తేల్చారు.

మరణాల రేటు 11 శాతం

జిల్లాలో చదరపు కిలోమీటరుకు 716 మంది జనసాంద్రత ఉన్నట్టు లెక్క తేల్చారు. మర ణాల రేటు 11 శాతంగా ఉంది. 2023-24లో ఇండియాలో మరణాల రేటు 7.42 శాతం ఉండగా, ఆంధ్రలో 6.3 శాతంగా ఉంది. కానీ జిల్లాలో 11 శాతంగా ఉందని నివేదిక తేల్చింది. తలసరి ఆదాయం రూ.2,55,650గా ఉంది.20 28-29కి రూ.5,21,778గా 2047-48కి రూ.50,67, 816గా పెంచాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇండస్ర్టియల్‌, సర్వీసు రంగాల ద్వారా 2023-24లో రూ.56, 468 కోట్లు ఆదాయం రాగా 2028-29కి రూ.1,15,539 కోట్లు, 2047-48కి రూ,10,19,903 కోట్ల లక్ష్యంగా నిర్ణయించారు.

పంటల సాగు మార్చండి..

జిల్లాలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో చేల గట్ల మీద కందిపంట సాగు ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. 77,820 హెక్టార్ల సాగుకు అనుకూలంగా ఉండాలని నిర్ణయించారు. మినుములు 2595 హెక్టార్లు, పెసలు 1000 హెక్టార్లు, వేరుశనగ 258 హెక్టార్లు, కాటన్‌ 502 హెక్టార్లు సాగు చేయాలని నిర్ణయించా రు. 4970 హెక్టార్లలో హార్టికల్చర్‌ పంటను ప్రోత్స హించే లక్ష్యంతోఉన్నారు. ఆర్చిడ్స్‌, కలర్‌ క్యాప్సికమ్‌, ఆఫ్‌ సీజన్‌ టమోటాలను 4 వేల హెక్టార్లలో సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకు న్నారు. డ్రాగన్‌, అవకాడో వంటి ఫ్రూట్స్‌ 10 హెక్టార్లలో సాగు చేయాలని నిర్ణయించారు. ఈసదస్సులో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌, జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహకిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:36 AM