శెహబాస్..తుఫాన్ హీరోస్!
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:23 AM
ఆనందంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు.. పలకరిస్తారు.. కానీ కష్టంలో ఉన్నమంటే మాత్రం అందరూ దూరమైపోతారు..
నిడదవోలు/అనపర్తి/గోపాలపురం/కొవ్వూరు/ రాజమహేంద్రవరం కల్చరల్, నవంబరు 1, (ఆంధ్రజ్యోతి) : ఆనందంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు.. పలకరిస్తారు.. కానీ కష్టంలో ఉన్నమంటే మాత్రం అందరూ దూరమైపోతారు.. అయి తే ఎవరైనా కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకున్న వారే నిజమైన హీరోస్.. ఇటీవల మొంథా తుఫాన్ రూపంలో అతిపెద్ద కష్టం జిల్లాపై వచ్చిపడింది..అయితే సీఎం చంద్రబాబు ఆదేశా లతో ఇటు నాయకగణం..అటు అధికార యంత్రాంగం రంగంలోకి దిగారు.. కష్టాన్ని కూకటివేళ్లతో పెకలించారు.. కేవలం రెండు రోజుల్లోనే సమస్యను తీర్చారు.దీనిలో భాగంగా శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మొంథా తుఫాన్ ఫైట ర్స్‌ను సత్కరించారు. వీరిలో మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మద్ది పాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వ రరావు, జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు తదితరులను మెమొంటో, ప్రశంసాపత్రంతో చంద్రబాబు ఇలా సత్కరించారు.