Share News

సీఎం కారులో చర్మకారుడు

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:45 AM

రాజమహేంద్రవరం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. మలకపల్లిలో చర్మకారుడు పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారదారులకు ఇచ్చే పింఛను ఇవ్వాల్సి ఉంది. అయితే పోసిబాబు ధర్మవరంలోని ఓ షాపు వద్ద ఉండడం గమనించిన యంత్రాంగం సీఎంకు చెప్పగా..ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసిబాబును కారులో ఎక్కించుకొని తన పక్క సీటులో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి మలకపల్లికి 2

సీఎం కారులో చర్మకారుడు
పోసిబాబు తయారుచేసిన చెప్పును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

సరుకులు కొనిచ్చిన ముఖ్యమంత్రి

చెప్పుల జత, టోపీకి రూ.5వేలు

రాజమహేంద్రవరం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. మలకపల్లిలో చర్మకారుడు పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారదారులకు ఇచ్చే పింఛను ఇవ్వాల్సి ఉంది. అయితే పోసిబాబు ధర్మవరంలోని ఓ షాపు వద్ద ఉండడం గమనించిన యంత్రాంగం సీఎంకు చెప్పగా..ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసిబాబును కారులో ఎక్కించుకొని తన పక్క సీటులో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి మలకపల్లికి 2కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకూ కుటుంబ నేపథ్యం, స్థితిగతులు, వృత్తి జీవితం తదితర విషయాలపై పోసిబాబును ఆరా తీశారు. ఒక్క సారిగా సీఎం చంద్రబాబు కారు ఎక్కడమే కాకు ండా ఆయన పక్కనే కూర్చొని రెండు కిలోమీర్లు ప్రయాణించడంపై పోసిబాబు సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో ఉన్నతాధికారులకు సైతం దక్క ని అవకాశం తనకు దక్కిందని, ఎంతో అదృష్టమంటూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పోసిబాబును తీసుకుని అతడి ఇంటికి వెళ్లి పింఛను అందజేసి యోగక్షేమాలు అడిగారు. పోసిబాబు డప్పును తీసుకొని దరువు వేశారు. దీంతో ఆ కుటుంబం మరింత మురిసిపోయింది. పోసిబాబు తయారు చేసిన చెప్పులు, టోపీని చంద్రబాబు ముచ్చటపడి కొనుగోలు చేశారు. వాటి నిమిత్తం రూ.5 వేలు పోసిబాబుకు చెల్లించారు. గ్రామంలో చర్మకార పింఛను పొందుతున్న వ్యక్తి పోసిబాబు ఒక్కడే కావడం గమనార్హం. అంతకు ముందు కొండా వెంకటేశ్వరరావు జనరల్‌ స్టోర్‌కి వెళ్లి వెం కటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కష్టసుఖాలపై ఆరా తీశారు. అనంతరం గెడ్డం కృష్ణ దుర్గా ఇంటికి వెళ్లి వితంతు పింఛను అంద జేశారు. అక్కడే తల్లి ఒడిలో ఉన్న పసిపాపను దగ్గరకు తీసుకొని ముద్దాడారు. దారి పొడవునా ఉన్న ప్రజలను చూస్తూ అభివాదం చేశారు.

మురిసిన మలకపల్లి

తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలో మలకపల్లి ఓ చిన్న గ్రామం. వివిధ విభాగాల్లో 783 మంది ఎన్టీఆర్‌ భరోసా పింఛను లబ్ధిదారులు ఉన్నారు. ఈ గ్రామానికే కాదు.. మండలానికే సీఎం రావడం ఇదే మొదటిసారి. అదీ ఆరు అడుగుల సందులోకారు వెళ్లడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో ఎస్సీ పేటలోకి సీఎం వెళ్లడం, పింఛన్లు ఇవ్వడం ఇదే మొదటి సారి. దీంతో ఆ చిన్న గ్రామం మురిసిపోయింది. సీఎం చంద్రబాబును చూడాలని సగం ఊరు సభకు చేరుకోగా.. మిగతావారు ఇంటి బయట వేచి చూశారు. ప్రస్తుతం రబీ వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయినా జనం ఉదయం 9గంటలకే స భా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎక్కువగా మహిళలే ఉన్నారు. ప్రజల కోసమే తాను వచ్చానని సీఎం చెప్పగా మలకపల్లి మురిసిపోయింది.

Updated Date - Jul 02 , 2025 | 12:45 AM