Share News

రైతన్నా - మీకోసం నేనున్నా..

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:40 AM

మీ సమస్యలు చెప్పండి.. వింటా.. పరిష్కరిస్తా.. అం టూ సీఎం చంద్రబాబు రైతులతో కలిసిపోయారు.. నల్లజర్ల లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో సాధారణ నులక మం చంపై కూర్చుని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా సీఎం చంద్రబాబు చెట్టుకింద కూర్చుని రైతులు చెప్పింది ఆసక్తిగా విన్నారు.. సూచనలు.. సలహాలు స్వీకరించారు.. మీరు చెప్పింది నేను చేస్తా అంటూ వారి భరోసానిచ్చారు. గోపాలపురం నియో జకవర్గం నల్లజర్ల జాతీయ రహదారికి సమీపాన బుధవా రం జరిగిన రైతన్నా-మీకోసం కార్యక్రమం ఎవరూ ఊహిం చని విధంగా సభ ఏర్పాటు చేశారు. ఆరంభం నుంచి

రైతన్నా - మీకోసం నేనున్నా..
నల్లజర్ల రైతన్నా - మీ కోసం సభలో నులక మంచంపై కూర్చుని రైతుల సమస్యలు వింటున్న సీఎ చంద్రబాబు

అండగా ఉంటా..ఆదుకుంటా

చెట్టు కింద.. నులక మంచంపై సీఎం సభ

హంగూ ఆర్భాటం లేకుండా నిర్వహణ

రైతుల సమస్యలు విన్నారు..

సలహాలు స్వీకరించారు..

మీరు చెప్పింది చేస్తా అంటూ భరోసా

నల్లజర్లలో చంద్రబాబు సభ సక్సెస్‌

(రాజమహేంద్రవరం/నల్లజర్ల/ గోపాలపురం/కొవ్వూరు/ దేవరపల్లి - ఆంధ్రజ్యోతి)

మీ సమస్యలు చెప్పండి.. వింటా.. పరిష్కరిస్తా.. అం టూ సీఎం చంద్రబాబు రైతులతో కలిసిపోయారు.. నల్లజర్ల లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో సాధారణ నులక మం చంపై కూర్చుని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా సీఎం చంద్రబాబు చెట్టుకింద కూర్చుని రైతులు చెప్పింది ఆసక్తిగా విన్నారు.. సూచనలు.. సలహాలు స్వీకరించారు.. మీరు చెప్పింది నేను చేస్తా అంటూ వారి భరోసానిచ్చారు. గోపాలపురం నియో జకవర్గం నల్లజర్ల జాతీయ రహదారికి సమీపాన బుధవా రం జరిగిన రైతన్నా-మీకోసం కార్యక్రమం ఎవరూ ఊహిం చని విధంగా సభ ఏర్పాటు చేశారు. ఆరంభం నుంచి చివరి వరకూ వినూత్నంగా.. ఆసక్తిగా జరిగింది. ఉదయం 12 గంటలకు ఆరంభమైన చంద్రబాబు పర్యటన సాయం త్రం ఐదు గంటల వరకూ సాగింది. మొదట ఒక రైతు పొలంలో వేసిన వివిధ పంటలను సీఎం స్వయంగా పరిశీలించారు.ఒకేచోట వివిధ రకాల మొక్కలు పెంచడం పై ఆరా తీశారు. అనంతరం వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఐదు స్టాల్స్‌ను తిలకించారు.ఆ స్టాల్స్‌లో వస్తువుల గురించి అధికారులు వివరించగా ఆయన విని.. వారిని అభినందించారు. రెండు గంటల సమయంలో కాసే పు విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ పోతవరం రోడ్డు సమీపంలో ఓ ప్రాం తంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలతో సమీ క్షించారు.తొలుత చంద్రబాబు భూగర్భజలాలు, పం టల మార్పిడి, ఆదాయం, యంత్రాల వినియోగం, లాభ సాటి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పంటల సాగు వంటి వాటి గురించి ప్రస్తావించారు. సభ ఏర్పాట్లు బాగా చేసి నందుకు కలెక్టర్‌ కీర్తి చేకూరిని, నియోజకవర్గంలో బాగా పనిచేస్తున్నందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజును అభి నందించారు.కలెక్టర్‌ కీర్తి చంద్రబాబును సన్మానించారు.రోడ్ల పొడవునా కార్యకర్తలు బారులు తీరారు. పోలీసులు బందో బస్తు, భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.గోపాలపురం నియో జకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.320 కోట్ల ప్రణాళికను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు సీఎంకు అందజేశారు. నల్లజర్లలోని హెలిప్యాడ్‌ వద్ద చంద్రబాబుకు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రులు కం దుల దుర్గేష్‌, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు, గోరంట్ల బుచ్చ య్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, బొలిశెట్టి శ్రీనివాస్‌, జనసేన నేత సువర్ణరాజు, మహిళా నేతలు స్వాగతం పలికారు.

నేనూ వ్యవసాయం చేసేవాడిని..

నేను కూడా రైతు బిడ్డనే.. వ్యవసాయం చేసేవాడిని.. రైతు కష్టమేంటో తెలిసినవాడిని..అయితే రాజకీయాల్లోకి వచ్చా. ఇవాళ రైతులు చదువుకున్నవారు ఉన్నారని.. పీజీలు, పీహెచ్‌డీలు చేసినవారున్నారని.. అందరూ ప్యాంట్లు వేసుకుని వచ్చారని..మోడరన్‌ రైతులయ్యారని జోకులు వేయడంతో అందరూ నవ్వుకున్నారు. సభలో సీఎం చంద్రబాబు ఇద్దరు రైతులను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అందులో ఒకరు ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్‌ నీలపాల నరసింహం కుడి వైపు కూర్చోగా, నల్లజర్లకు చెందిన గుదే అర్జునరావు ఎడమ వైపు కూర్చున్నారు.

అధిక శాతం మఫ్టీలోనే.. నిఘాకు ప్రాధాన్యం

విజిబుల్‌ పోలీస్‌.. ఇన్‌విజిబుల్‌ పోలీసింగ్‌.. ఇది సీఎం చంద్రబాబు పదే పదే పోలీసులకు చెప్పేమాట. ఆయన నల్లజర్ల పర్యటనకు జిల్లా పోలీసులు ఆ మాటను నిజం చేశారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌, ఎస్పీ నరసింహ కిశోర్‌ 1300 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 సెక్టార్లుగా విభజించి నలుగురు అడిషనల్‌ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 63 మంది ఎస్‌ఐలు, మిగతా సిబ్బందిని నియమించారు. 7 స్పెషల్‌ పార్టీలు, 25 రోప్‌ పార్టీలు, 5 ఏరియా డీవోఎం పార్టీలను బందోబస్తులో భాగం చేశారు. ఈసారి సుమారు 60 శాతం మందికి యూనిఫాం వేయలేదు. మఫ్టీలోనే జనాల్లో తిరుగుతూ అనుపానులు గమనించారు. మహిళా పోలీసులను మఫ్టీలో మోహరించారు. కీలకమైన ప్రాంతాల్లోని కెమెరాలను డీజీపీ, నిఘా చీఫ్‌ కంట్రోల్‌కి అనుసంధానించారు. డ్రోన్ల ఫుటేజీలను నిరంతరం పరిశీలించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఇద్దరు చొప్పున బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు.

1.14 లక్షల మంది రైతు కుటుంబాలను కలిశాం : కలెక్టర్‌

నవంబరు 24 నుంచి 30వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లాలో లక్షా 14 వేల రైతు కుటుంబాలను కలిశాం. ఇంటింటికి వెళ్లి సీఎం సందేశ లేఖను అందించాం. నీటి భద్రత, డిమాండ్‌ అధారిత వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, విలువవృద్ధి, ప్రభు త్వ సమన్వయం అనే పంచసూత్రాల అమ లుతో వ్యవసాయరంగం బలోపేతవుతుంద ని ‘తూర్పు’ జిల్లా కలెక్టర్‌ కీర్తి పేర్కొన్నారు.

ఆదర్శ రైతులకు సత్కారం

సీఎం సమక్షంలో ఆదర్శ రైతులు సింగరాజుపాలెం గ్రామానికి చెందిన దొండపాటి లక్ష్మీనారాయణ(బాబు), గుండుగొలనుగుంటకు చెందిన ఒబెలిశెట్టి గోపాలకృష్ణ, కురుకూరుకు చెందిన యెలమతి భాస్కరరావు, దుద్దుకూరుకు చెందిన కాకర్ల హరినాఽథ్‌, చిట్యాలకు చెందిన గద్దె హరిశ్చంద్రప్రసాద్‌, యర్నగూడెం గ్రామానికి చెందిన గద్దె మునేశ్వరరావు, వాదాలగుంటకు చెందిన గేద జోగేంద్ర ప్రసాద్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందించారు.

రైతులకు అండగా : ఎమ్మెల్యే మద్దిపాటి

రైతుల ఆదాయం పెంచే విధంగా తమ ప్రభుత్వం నూతన సంస్కరణలు తీసుకొచ్చి రైతు కుటుంబానికి అండగా ఉంటుం ది. 25 ఏళ్ల కిందట చంద్రబాబు ఇంకుడు గుంతలు తవ్వండి, చెక్‌ డ్యామ్‌లు కట్టండి అంటే ఎవరూ పెద్దగా పట్టించు కోలే దు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితిలో రైతులే ఇంకుడు గుంతలు కావాలంటున్నారు.. చంద్రబాబు విజన్‌ ఇలా ఉంటుంది. నదులను అనుసంధానం చేశారు. రైతుకు ఏది అవసరమో అది చేస్తారు.

Updated Date - Dec 04 , 2025 | 01:40 AM