31న ముమ్మిడివరంలో సీఎం పర్యటన
ABN , Publish Date - May 27 , 2025 | 01:07 AM
ముమ్మిడివరం, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 31న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, పలు శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ సమీక్షించారు. ముమ్మిడివరం మండలం సీహెచ్.గున్నేపల్లిలోని ఓఎన్జీసీ స్థలాన్ని ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ల్యాం
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
ముమ్మిడివరం, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 31న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, పలు శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ సమీక్షించారు. ముమ్మిడివరం మండలం సీహెచ్.గున్నేపల్లిలోని ఓఎన్జీసీ స్థలాన్ని ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాకు వివరాలు వివరించారు. 31న ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో పాటు పురోగతిలో ఉన్న పలు కార్యక్రమాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నట్టు పరిశీలించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో ప్రారంభించే పీ4 కార్యక్రమ సభ, బహిరంగ వేదిక ఏర్పాట్లను అధికారుల బృందం పరిశీలించింది. చెయ్యేరు సభావేదిక సమీపంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రూ.9లక్షల 80వేలతో చేస్తున్న పూడికతీత, చెరువు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. చెరువు పూడికతీత, అభివృద్ధి పనులను సీఎం నిశితంగా పరిశీలించనున్నట్టు కలెక్టర్ వివరించారు. చెయ్యేరు గ్రామ అభివృద్ధి, గ్రామంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుతీరు, భౌగోళిక విస్తీర్ణం, జనాభా తదితర వివరాలను సేకరించి సిద్ధంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారిణి శాంతలక్ష్మిని ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సీహెచ్.గున్నేపల్లిలోని ఓఎన్జీసీ సైట్‌లో హెలికాఫ్టర్ ల్యాండింగ్ అయిన తరువాత అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో చెయ్యేరు చేరుకోనున్నట్టు సమాచారం. పరిశీ లనలో ఆర్‌అండ్‌ఎంబీ ఎస్‌ఈ బి.రాము, పంచాయతీరాజ్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి, ఆర్డీవో కె.మాధవి, నాయకులు దాట్ల రాజేష్, చెల్లి అశోక్, ఎంపీడీవోలు శ్రీవెంకటాచార్య, వెంకటాచలం, తహశీల్దార్ సునీల్‌కుమార్, డిప్యూటీ తహశీల్దార్ గోపాలకృష్ణ, సీఐ ఎం.మోహన్‌కుమార్, ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్,ఏపీవో చంద్రమోహన్ ఉన్నారు.