Share News

ప్రతీ ఒక్కరూ స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు కృషి చేయాలి

ABN , Publish Date - May 18 , 2025 | 01:14 AM

ప్రతీ పౌరుడు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ చేసే దిశగా కృషి చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు పేర్కొన్నారు.

 ప్రతీ ఒక్కరూ స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు కృషి చేయాలి

మామిడికుదురు, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రతీ పౌరుడు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ చేసే దిశగా కృషి చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు పేర్కొన్నారు. మగటపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌పై అవగాహన ర్యాలీ శనివారం జరిగింది. ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్‌ పాల్గొని స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు గల రోడ్డును శుభ్రపర్చారు. ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఈలి శ్రీనివాస్‌, వర్థినేని బాబ్జి, దిరిశాల బాలాజీ, చాగంటి స్వామి, చెల్లింగి సింహాచలం, కుంచే శ్రీనివాస్‌, యాలంగి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మామిడికుదురులో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ గౌస్‌ మొహిద్దీన్‌ స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉప సంచాలకుడు సుబ్రహ్మణ్యం, ఎంఈవోలు వెంకన్నబాబు, లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ వర్థినేని రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:14 AM