కేశవస్వామి ఆలయంలో సివిల్ కోర్టు జడ్జి పూజలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:40 AM
ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు.
ఆత్రేయపురం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తు లు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశా రు. అశేష భక్తజనం స్వామివారి అన్నప్రసాదంలో పాల్గొన్నారు. కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎంవీఎస్ సుబ్బారావు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ ఈవో రమణమూర్తి ఆయా ఏర్పాట్లను పర్యవేక్షించారు.