Share News

కాకినాడ మదిలో చిరంజీవినే..

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:12 AM

అభ్యుదయవాది, సాహితీవేత్త, విద్యా రంగానికి మార్గదర్శకురాలు, సామాజికవేత్త, కాకినాడలోని ఐడియల్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌, కార్యదర్శి డాక్టర్‌ పి.చిరంజీవినీకుమారి(94) ఆదివారం మధ్యాహ్నం గుండె పోటుతో ఇంటివద్ద తుదిశ్వాస విడిచారు.

కాకినాడ మదిలో చిరంజీవినే..

  • సాహిత్య శిఖరం ఆమె.. విద్యాకుసుమం ఆమె..

  • అభ్యుదయ భావజాలమే ఆమె ఆభరణం..

  • తెలుగు భాషావృద్ధికి ఆమె కృషి అమోఘం..

  • సాగరతీరం కాకినాడలో ఎన్నో తరాలను

  • తీర్చిదిద్దిన సుజ్ఞాని ఆమె..

  • బతుకునిచ్చే పాఠాలు, జీవన వికాసానికి

  • పాటవాలు నేర్పిన ఉపాధ్యాయినిగా..

  • విద్య, సాహిత్య, సేవా రంగాలను

  • సమాజహితంగా ఏలిన మహారాణిగా..

  • సామాజిక దృక్పథమై అనేక వేదికలపై వినిపించిన సబలవాణి..

  • కాకినాడ ఐడియల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చిరంజీవినీ కుమారి..

  • ఆమె పరమపద సోపానం.. కాకినాడను దుఃఖసాగరంలో ముంచింది.

  • వయోభారంతో ఆమె వెడలినా.. ఆమె జీవన ప్రస్థానం..

  • వేనవేల మంది మదిలో.. కాకినాడ హృదిలో ఆమె ‘చిరంజీవిని’..

  • అందుకే ఆమెను ‘మదర్‌’ ఆఫ్‌ కాకినాడ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..

  • అస్తమించిన అభ్యుదయవాది చిరంజీవినీ కుమారి

  • 94 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)/కాకినాడ రూరల్‌:

అభ్యుదయవాది, సాహితీవేత్త, విద్యా రంగానికి మార్గదర్శకురాలు, సామాజికవేత్త, కాకినాడలోని ఐడియల్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌, కార్యదర్శి డాక్టర్‌ పి.చిరంజీవినీకుమారి(94) ఆదివారం మధ్యాహ్నం గుండె పోటుతో ఇంటివద్ద తుదిశ్వాస విడిచారు. 1931, మార్చి 30న ఆమె జన్మించారు. చిరంజీవినీకుమారి భర్త పేరు పాలెపు శర్మ.. స్వాతంత్య్ర సమరయోధుడు..ఆయన కొన్నేళ్ల కిందట మరణించారు. వీళ్లకి ఇద్దరు కుమా రులు.పెద్ద కుమారుడు పీబీఎన్‌ గోపాల్‌ వృ త్తి రిత్యా వైద్యుడు విదేశాల్లో ఉంటున్నారు. చిన్నకుమారుడు పీఎస్‌ఎస్‌ కిరణ్‌.. కాకి నాడ లోనే ఉంటూ కుటుంబ వ్యాపారాలు చూసు కుంటున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా చి రంజీవినీ కుమారి గుర్తింపు పొందారు. మానవ మనుగడకు మూలాలే ప్రధా నం. వాటిని అసలు మరిచిపోకూడదనే ఆమె.. ఆ స్తులను పంచి ఇచ్చినట్టుగానే వాటిని పిల్లలకు పంచి ఇవ్వాలని చెబుతూ ఉండేవారు. ఆమె మానవ విలువలపైనే వేదికలపై ప్ర సంగించేవారు. మానవసంబంధాలు మృగ్యమైపోతున్నాయని వాటిని కాపాడాలని పదేపదే చెప్పేవారు. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా జిల్లాలో భాషా సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఐడియల్‌ కళాశాలలో తెలుగు భాషను మా త్రమే ద్వితీయ భాషగా కొనసాగిస్తూ తెలు గు భాషా సంస్కృతి వికాసానికి ఎనలేని సేవలందించారు.మహాకవి శ్రీశ్రీ స్తపతి, వెయ్యేళ్ల తెలుగు సాహిత్య వేడుకలు, డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం మొదలైన కార్యక్రమాలు ఐడియల్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలోనే నిర్వహించారు. కాకినాడ రూరల్‌ మండలంలోని కొవ్వాడ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ యువతకు ఉపాధికి కృషి చేశారు. మహిళలు, పిల్లలు, తదితర యువతీయువకుల్లోని ప్రతిభాపాటవాలను వెలికితీయిస్తున్నారు.

1970లో కళాశాల పెట్టి..

కాకినాడ జిల్లా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా కొంతకాలం పనిచేసిన చిరంజీవినీకుమారి డాక్టర్‌ పీవీఎన్‌ రాజుతో కలిసి 1970లో ఐడి యల్‌ జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. రా ష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదివిన వారే. నేడు డిగ్రీ, ఇం జినీరింగ్‌ కళాశాలల్లో ఎంతో మంది విద్యార్థు లు చదువుకుంటున్నారు. ఆమె కాకినాడ అ న్నవరం సత్యవతీదేవి మహిళా కళాశాల ఫౌండర్‌ మెంబర్‌గా, ఐడియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాల, ఐడియల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌కు ఫౌండర్‌ సెక్రటరీగా, ఐడి యల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్సిస్టిట్యూషన్స్‌కు సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఫౌండర్‌ మెంబర్‌ ఆఫ్‌ ఏయూ పీజీ సెంటర్‌ కాకినాడ, ఏపీ స్టేట్‌ ప్రైవేట్‌ కాలేజీస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, వేణుగోపాల సంస్కృత ప్రచార సభ కాకినాడ సెక్రటరీగా, తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంఘం సెక్రటరీగా, గిరిజన ప్రాంతంలోని ‘స్పందన’ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్‌గా, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌గా, ఆంధ్ర ప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సభ్యురాలిగా, జనవిజ్ఞాన వేదిక స్టేట్‌ ఎగ్జి క్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య సభ్యురాలిగా, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సాధన సమితి వైస్‌ ప్రెసిడెంట్‌గా, జిల్లా అక్షరాస్యత సమితి ‘అక్ష ర గోదావరి’ సభ్యురాలిగా, జిల్లా విద్యాకమిటీ, జిల్లా టీబీ నియంత్రణ కమిటీ, జిల్లా అధికార భాషా సంఘం సభ్యురాలిగా ఎలా ఎన్నో పదవులను ఆమె చేపట్టారు. 2005లో న్యూఢిల్లీ వారు మదర్‌ ఇండియా జాతీయ అవార్డు అందజేశారు.హైదరాబాద్‌లో తుమ్మల వెంకట్రామయ్య సాహితీ సత్కారం, 2011 లో శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం, 2012లో షీ ఫౌండేషన్‌ హైదరాబాద్‌ వారు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యు కేషన్‌,ఉమెన్‌ పురస్కారం అందజేశారు. 2014లో ఐ.పోలవరంలోని పుల్లెల తా తయ్య మెమోరియల్‌ అసోసియేషన్‌ వారు ఇంటి గ్రల్‌ హ్యూమనిస్ట్‌ అవార్డు అందజేశారు.

ఎన్నో రచనలు..

రచయితగా అనేక పుస్తకాలు రచించారు. 3-బుక్స్‌ ఆఫ్‌ తెలుగు పొయిట్రీ, బుక్‌ ఆఫ్‌ పోయమ్స్‌ ఆఫ్‌ 32 ఉమెన్‌ రైటర్స్‌ ఆఫ్‌ సోవియట్‌ ల్యాండ్‌ ‘లేత మందారాలు.. రక్త సిం దూరాలు’,ఏ బుక్‌ ఆఫ్‌ స్టోరీస్‌ ట్రాన్స్‌లేటెడ్‌ ఫ్రమ్‌ఆర్మీనియన్‌ రైటర్స్‌ ఎస్పె షల్లీ తుమాన్వాన్‌..‘ఆర్మీనియా కథలు- గాథలు ’..‘తూర్పుగోదావరి జిల్లా చరిత్ర- సం స్కృతి’, గోదావరి కథలు-అలలు(తూర్పుగోదావరి జిల్లా కథల సంకలనం),ఎ రైటర్‌ ఆఫ్‌ అబౌట్‌ 80 ఎస్సేస్‌ ఇన్‌ ఏరియా ఆఫ్‌ లిటరేచర్‌, సోషల్‌ అండ్‌ ఉమెన్‌ ఏస్పెక్ట్స్‌, అభౌట్‌ 20 రేడియో టాక్స్‌ (మంచి వక్త, విమర్శకురాలు) ఉన్నాయి.

నేడు అంత్యక్రియలు

కాకినాడ ప్రతాప్‌నగర్‌లోని ఆమె నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గం టకు చిరంజీవినీ కుమారి భౌతికకాయాన్ని ఊరేగింపుగా ఇంద్రపాలెం లాకుల వద్ద గల ఐడియల్‌ కళాశాలకు తీసుకెళ్లనున్నారు. విద్యార్థులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని అక్కడ ఉంచనున్నారు. అక్కడి నుంచి 3 గంటలకు శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కళాశాల గవర్నింగ్‌ బాడీ తెలిపింది.

పలువురి సంతాపం

ఐడియల్‌ కళాశాల అధినేత డాక్టర్‌ చిరంజీవినీకుమారి మృతిపట్ల సీపీఎం కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసిం ది. సీపీఎం జిల్లా కార్యదర్వి కరణం ప్రసాదరావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిరంజీవినికుమారిని అభివర్ణించారు. కాకినాడకు సం బంధించిన అనేక సమస్యలు, ముఖ్యంగా మహిళా సమస్యలపై ఆమె స్పందించేవారన్నారు. సదస్సులు, చర్చల ద్వారా నిరంతరం ప్రజలను జాగృతం చేసేవారని గుర్తుచేసుకున్నారు. ఆమె మరణం అన్నిరంగాలకు తీరనిలోటన్నారు. యూటీఎఫ్‌ నాయకులు చక్రవ ర్తి, ఐ.ప్రసాదరావు, నగేష్‌, సూరిబాబు ప్రగా ఢ సంతాపం తెలిపారు. అనేకమార్లు యూ టీఎఫ్‌ సభలకు వచ్చిన సందేశాలిచ్చారన్నా రు. కాకినాడలో జరిగిన యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ సభలకు తనవంతు సహాయ, సహకారాలు అందించారని రాష్ట్ర మాజీ కార్యదర్శి ప్రభాకర వర్మ తెలిపారు. ఆమె మరణం సాహిత్యలోకానికి, కాకినాడ నగరానికి తీరనిలోటని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యద ర్శి బి.సిద్ధూ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. విద్య, సాహిత్య, సేవా రం గాల్లో సుధీర్ఘకాలం అలుపెరుగని యోధురాలిగా గుర్తింపు తెచ్చుకున్న అంద రికీ ఆదర్శమన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 01:12 AM