Share News

30 రోజులు.. 100 ప్రసవాలు!

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:20 AM

చింతూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): 30 రోజుల్లో 100 ప్రసవాలతో అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు ఏరియా ఆసుపత్రి రికార్డు సృష్టించింది. దీంతో ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్‌ ఆదివారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి, గైనకాల జిస్టులు డాక్టర్‌ రమణా రా

30 రోజులు.. 100 ప్రసవాలు!
చింతూరు ఆసుపత్రిలో ప్రసవ మహిళల వార్డు

రికార్డు సృష్టించిన చింతూరు ఏరియా ఆసుపత్రి

వైద్యులను అభినందించిన ఐటీడీఏ పీవో

చింతూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): 30 రోజుల్లో 100 ప్రసవాలతో అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు ఏరియా ఆసుపత్రి రికార్డు సృష్టించింది. దీంతో ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్‌ ఆదివారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి, గైనకాల జిస్టులు డాక్టర్‌ రమణా రావు, డాక్టర్‌ శశికళను అభినందించారు. మొ న్నటి వరకు గర్భిణులకు ప్రసవ తీరులో కాసింత సమస్య ఉందంటే చాలు ఇక్కడ నుంచి తెలంగా ణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి హుటా హుటిన తరలించేవారు. ఈ క్రమంలో గర్భిణుల తో సహా ఆయా కుటుంబాలు నానా అవస్థలు పడాల్సివచ్చేది. ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితి ని ఎదుర్కోవాల్సి వచ్చేది. అంతేకాక పలు సంద ర్భాల్లో పరిస్థితి విషమించడం, అక్కడి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి రావడం తదుపరి పేద, ఆదివాసీ కుటుంబాలు ఆసుపత్రుల బిల్లుల కోసం అప్పుల పాలైన సందర్భాలు ఉన్నాయి. ఇ టీవల చింతూరు ఆసుపత్రిని ప్రభుత్వం కమ్యూ నిటీ హెల్త్‌సెంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంతో పా టుగా అదే దశలో ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రధానంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంవీ కోటి రెడ్డి స్వయంగా అనస్థిసియా డాక్టర్‌ (మత్తు మందు వైద్యుడు) కావడం అదేదశలో ఇరువురు గైనకాల జిస్టులను ప్రభుత్వం ని య మించడంతో ప్రసవ వైద్యసేవలు మరింత అందుబాటులోకి వ చ్చాయి. అం తేకాకుం డా ప్రసవాలకు తెలం గాణకు తరలించాల్సిన అవసరం దాదాపు లేకం డా పోయింది. ఇటీవల ప్రసవాలపై ఆసుపత్రి సూప రింటెండెంట్‌ కోటిరెడ్డి బృందం ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు సాధారణ కాన్పుల కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ప్రత్యేక వసతుల తో కూడిన నవజాతి శిశు కేంద్రం (ఎస్‌ఎన్‌సీ యూ) ఏర్పాటుచేయడం ఆ మేరకు ప్రత్యేక వై ద్యనిపుణుడిని నియమించడంతో శిశుమరణాల సంఖ్య గణనీ యంగా తగ్గింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవ రిలో 64, ఫిబ్రవరి 48, మార్చి 50, ఏప్రిల్‌ 68, మే 48, జూన్‌ 54, జులై 50, ఆగస్టు 92, సెప్టెంబరు 95, ఇక సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 26 వరకు 30 రోజుల్లో 100 ప్రసవాల టార్గెట్‌ను సాధించి జిల్లా రికార్డును సొంతం చే సుకోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఆసుప త్రి వైద్యులు,సిబ్బంది అభినందనలు అందుకున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 12:20 AM