Share News

నూరుశాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలి

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:24 AM

చింతూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మన్యంలో నూటికి నూరుశాతం ఉద్యోగ అవకాశాలు స్థానిక ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. సోమవారం చింతూరులో భారీ వర్షంలోను ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకుని ముట్టడించారు. కొద్దిరోజులుగా ఆదివాసీ నిరుద్యోగులు మండలంలోని

నూరుశాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలి
చింతూరులో వర్షంలోను ర్యాలీగా ఆదివాసీలు

చింతూరులో ఆదివాసీ నిరుద్యోగుల భారీ ర్యాలీ... జోరు వర్షంలోను ఐటీడీఏ ముట్టడి

చింతూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మన్యంలో నూటికి నూరుశాతం ఉద్యోగ అవకాశాలు స్థానిక ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. సోమవారం చింతూరులో భారీ వర్షంలోను ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకుని ముట్టడించారు. కొద్దిరోజులుగా ఆదివాసీ నిరుద్యోగులు మండలంలోని ఆదివాసీ గ్రామాలు పర్యటించి జీవో నెం.3 తొలగిం పుతో ఆదివాసీ నిరుద్యోగులకు జరిగిన నష్టంపై వివ రించారు. అదేదశలో తమ డిమాండ్లు సాధించుకోవడా నికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందని నిరుద్యోగులు ఊరూరా పర్యటించి సమావేశాలు, సభలు నిర్వహించి ఆదివాసీలకు అవగాహన కల్పిం చారు. ఈ మేరకు సోమవారం ఐటీడీఏ ముట్టడి కార్య క్రమానికి ప్రతి ఆదివాసీ స్వచ్ఛందంగా తరలిరావా లని కోరగా పలు ఆదివాసీ సంఘాలు మద్దతునిచ్చా యి. జోరున వర్షం కురుస్తున్నా వెనకడుగు వేయకుం డా ర్యాలీ, ముట్టడి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మన్యం లో నూటికి నూరు శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆదివాసీ యువతకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి మన్యం లో స్థానిక ఆదివాసీలకే అవకాశం కల్పించాలని, మన్యంలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ నాయకులు మడివి నెహ్రూ, అప్పల నర్స్‌, సీసం సురేష్‌, జల్లి నరేష్‌, కుంజా శ్రీను, ఉయిక రాంప్రసాద్‌, కారం సాయి బాబు, పొడియం రామకృష్ణ, మడివిరాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:24 AM