Share News

ఆరోగ్య ప్రదాత ధన్వంతరి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:32 PM

ఆలమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాతగా, దర్శనభాగ్యంతో సర్వరోగ నివారణ కలిగించే శక్తి గల స్వామిగా శ్రీధన్వంతరి స్వామిని కొలుస్తారు. శ్రీమన్నారాయణుని యేకవింశతి అవతారాల్లో పన్నెండవది ధన్వంతరి అవతారం. ఇంతటి శక్తిగల ధన్వంతరి స్వామివారికి ఉ

ఆరోగ్య ప్రదాత ధన్వంతరి
చింతలూరులోని ధన్వంతరి ఆలయం

చింతలూరులో కొలువైన స్వామివారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయం

నేడు జయంతి సందర్భంగా వ్రతం, పూజలు

ఆలమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాతగా, దర్శనభాగ్యంతో సర్వరోగ నివారణ కలిగించే శక్తి గల స్వామిగా శ్రీధన్వంతరి స్వామిని కొలుస్తారు. శ్రీమన్నారాయణుని యేకవింశతి అవతారాల్లో పన్నెండవది ధన్వంతరి అవతారం. ఇంతటి శక్తిగల ధన్వంతరి స్వామివారికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో ఉంది. దేవదానవులు అమృత సంపాదనకై క్షీర సాగరాన్ని మధించే తరుణంలో శంఖు, చక్ర, ఔషధ, సుధా కలశాలు నాలుగు హస్తముల ధరించి పాలకడలి నుంచి బయల్పడిన విష్ణ్వంశసంభూతుడు ధన్వంతరి. దుర్వాసుని శాపంతో రోగభూయిష్టమైన స్వర్గలోకంలో ఆయుర్వేద ప్రచారకుడై, ఆరోగ్య ప్రదాతయైు ఆరాధ్యదైవమైనాడు ఈ స్వామి. ధన్వంతరిని ఆయుర్వేద రంగానికి ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఆయన కరుణాకటాక్షాలతోనే ఆయుర్వేద రంగం కొనసాగుతోందని పలువురు ఆయుర్వేద పండితుల విశ్వాసం. ధన్వంతరి స్వామి కటాక్షంతో ఆయుర్వేద పండితుడు, వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులైన వైద్యరాజ ద్విభాష్యం వేంకటేశ్వర్లు భక్తి ప్రవత్తులతో ధన్వంతరిస్వామి ఆల యాన్ని ఆలమూరు మండలం చింతలూరులో 1942లో ప్రతిష్ఠించి నిత్య ధూప, దీప, నైవేద్యాదులకు శ్వాశత భూ వసతి కల్పించారు. వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం ప్రస్తుతం మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వి భాష్యం వెంకటశ్రీరామమూర్తి ఆధ్వ ర్యంలో ధన్వంతరి ఆలయాన్ని పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయంగా ఉండడంతో ధన్వంతరీ స్వామిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. శ్రీధన్వ ంతరి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి చింతలూరు రానునున్నారు. ధన్వంతరి వ్రతం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి.

Updated Date - Nov 16 , 2025 | 11:33 PM