చించినాడ-దిండి వంతెన మరమ్మతులు ప్రారంభం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:31 AM
మలికిపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చించినాడ-దిండి వద్ద వశిష్ట నదిపై 2 దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన మరమ్మతులను సోమవారం ప్రారంభి ంచా రు. ఉదయం నుంచి వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామని ముందస్తుగా ప్రకటించారు. అయితే భారీ వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు పనుల జోలి
మలికిపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చించినాడ-దిండి వద్ద వశిష్ట నదిపై 2 దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన మరమ్మతులను సోమవారం ప్రారంభి ంచా రు. ఉదయం నుంచి వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామని ముందస్తుగా ప్రకటించారు. అయితే భారీ వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు పనుల జోలికి వెళ్లలేదు. మధ్యాహ్నం 2 గంటల ను ంచి వంతెనకు ఇరువైపులా పాదచారులను సైతం నిలిపివేశారు. నదిలో వంతెనకు సంబంధించిన 14 పిల్లర్ బేరింగులను కొలతలు వేసే పని చేపట్టారు. పార్ట్ పీటీఎఫ్ బేరింగులు అమర్చవలసి ఉందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. సుమారు 150 మంది వరకు పనులు చేస్తున్నట్టు చెప్పారు. సిబ్బంది వంతెన పియర్స్‌ను పైకి ఎత్తి తద్వారా కొలతలు సేకరించి తదుపరి బేరింగులు అమరుస్తామని తెలిపారు. మళ్లీ గురువారం వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామన్నారు. వంతెనపై మోటారుసైకిళ్లు, పాదచారులు, చిన్నవాహనాలను నిలిపివేయడంతో వందలాది ప్రయాణికులు వంతెన వద్దకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. హైవే సిబ్బంది ఇరువైపులా ఎటువంటి వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.