చించినాడ వారధిపై 18, 21 తేదీల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలుపుదల
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:24 AM
అమలాపురం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వశిష్ఠ నదిపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య దిండి-చించినాడ మధ్య ఉన్న వారధిపై ఈ నెల 18, 21 తేదీల్లో పూర్తిగా ట్రాఫిక్‌ను నిలుపుదల చేస్తున్నట్టు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వ
కోనసీమ కలెక్టర్ ప్రకటన
అమలాపురం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వశిష్ఠ నదిపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య దిండి-చించినాడ మధ్య ఉన్న వారధిపై ఈ నెల 18, 21 తేదీల్లో పూర్తిగా ట్రాఫిక్‌ను నిలుపుదల చేస్తున్నట్టు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ 2 రోజుల పాటు పూర్తిగా ఈ వారధిపై ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవని స్పష్టం చేశారు. మోటారు సైకిల్‌తో సహా ఏ ఒక్క వాహనం ప్రయాణించడానికి వీలు ఉండదన్నారు. జాతీయ రహదారి 216లో ఉన్న దిండి-చించినాడ మధ్య వారధికి సంబంధించి బేరింగ్ రిప్లేస్‌మెంట్ మరమ్మతుల దృష్ట్యా 2 రోజులు ట్రాఫిక్ నిలుపుదల అనివార్యమైనట్టు కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారి అథారిటీ అధికారుల, రోడ్డు కాంట్రాక్టరు బేరింగుల కొలతలు, స్లీవ్ స్థానాల ధ్రువీకరణ కోసం వంతెన స్పాన్‌లను ఎత్తివేయాలని ప్రతిపాదించారని, ఆ దిశగా ఈనెల 18, 21 తేదీల్లో ట్రాఫిక్ నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాహనాల ట్రాఫిక్ మళ్లింపు విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో