చిన్నారుల కిడ్నాప్ కలకలం
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:36 AM
రాజమహేంద్రవరంలో ఇద్దరు చిన్నపిల్లలు కిడ్నాప్‌కు గురైనట్టు కలకలం రేగింది.
పక్కవీధిలోనే ఆడుకుంటున్న చిన్నారులు
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో ఇద్దరు చిన్నపిల్లలు కిడ్నాప్‌కు గురైనట్టు కలకలం రేగింది. రాజమమహేంద్రవరం వీఎల్ పురం సమీపంలో పిరమిడ్ సమీపంలో అపార్టుమెంట్ వద్ద అన్నాచెల్లెలు భాను ప్రసాద్(7), మోహన(5) ఆదివా రం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆడుకుంటున్నారు. కొద్దిసేపటికి తల్లి అపార్ట్‌మెంట్ బయటకు వచ్చి చూస్తే పిల్లలిద్దరు కనిపించలేదు. దీంతో కంగారు పడి అటూ ఇటూ చూసి పిల్లలను ఎవరో ఎత్తుకుపోయారని భావించింది. భయంతో చుట్టుపక్కల వారికి చెప్పడంతో కొంత మంది సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్‌లు పెట్టేశారు. బాలల తల్లి ఫోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇటు ప్రకాశ్‌నగర్ పోలీసులు అటు బొమ్మూరు పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ శ్రీవిద్య ఆధ్వ ర్యంలో అపార్ట్‌మెంట్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించి ఆ పిల్లలు ఆడుకుంటూ పక్క వీఽదిలోకి వెళ్లినట్టు గుర్తించి అటు వైపు వెళ్లి చూస్తే పిల్లలిద్దరు ఆడుకుంటూ కనిపించారు.ఆ పిల్లలను తీసుకుని వారి తల్లికి డీఎస్పీ శ్రీవిద్య అప్పగించి పిల్లల పట్ల జాగ్రత్తలు చెప్పారు.