21 మందికి రక్త పరీక్షలు.. 19 మందికి చికున్‌గున్యా
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:49 AM
రాజవొమ్మంగి సెప్టెంబరు 13 (ఆంధ్రజోతి): అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ల బ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల్లో ప్రజలు అనా రోగ్య సమస్యలతో గత 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు ఇటీవల జిల్లా కలెక్టర్ వచ్చి వెళ్లిన తరువాత రోజే మహిళ అనారోగ్యంతో మృతిచెందడం తెలిసిందే. అయితే అనా రోగ్యానికి గల కారణాలు తెలియకపోవడంతో స్టే ట్ టీం కిండ్రలో ఈనెల 10న వైద్య శిబిరం నిర్వ హించి 21మంది నుంచి రక్త నమునాలు సేకరించిం ది.అయితే వారిలో 19మందికి చికున్‌గున్యా పా జిటివ్ వచ్చినట్టు అధికారులు శుక్రవారం రా త్రి నిర్ధారించారు. అ యితే 21
అనారోగ్యంతో లబ్బర్తి, లాగరాయి, కిండ్ర ప్రజలు
సరిగ్గా అందని వైద్యసేవలు
రాజవొమ్మంగి సెప్టెంబరు 13 (ఆంధ్రజోతి): అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ల బ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల్లో ప్రజలు అనా రోగ్య సమస్యలతో గత 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు ఇటీవల జిల్లా కలెక్టర్ వచ్చి వెళ్లిన తరువాత రోజే మహిళ అనారోగ్యంతో మృతిచెందడం తెలిసిందే. అయితే అనా రోగ్యానికి గల కారణాలు తెలియకపోవడంతో స్టే ట్ టీం కిండ్రలో ఈనెల 10న వైద్య శిబిరం నిర్వ హించి 21మంది నుంచి రక్త నమునాలు సేకరించిం ది.అయితే వారిలో 19మందికి చికున్‌గున్యా పా జిటివ్ వచ్చినట్టు అధికారులు శుక్రవారం రా త్రి నిర్ధారించారు. అ యితే 21 మందికి పరీక్షలు చేస్తే అందులో 19మందికి పాజిటివ్ రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ నెల నుంచే గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురైతే అప్పట్లోనే అధికారులు ఆరుగురికి రక్త పరీక్షలు చేసి ఒకరికి చికున్‌గున్యా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అయితే అప్పట్నుంచి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కేవలం పీహెచ్‌సీ పరిధిలో సిబ్బందితో మెడికల్ క్యాంప్ పెట్టామంటూ తంతు గడిపారే తప్ప అధిక సంఖ్యలో ప్రజలు అనారోగ్యా నికి గురికాకుండా చర్యలు చేపట్టలే దు. గ్రామాల్లో పరిస్థితులపై ఆగస్టు 25న ఎంపీపీ గోము వెంకటలక్ష్మి కలెక్టర్‌కు నివేదించడం వల్ల 29న డీ ఎంహెచ్‌వో వచ్చి ప్రజలతో మాట్లాడి వెళ్లారు. మళ్లీ సెప్టెంబర్ 8న పత్రికల్లో వార్తలు రావడంతో అధికార యంత్రాంగం కదిలి ప్రస్తుతం డిస్ట్రిక్ టీం, స్టేట్ టీం అంటూ గ్రామల్లో చర్యలు చేపడుతున్నారు. ప్రజలు చనిపోతే తప్ప ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా, అప్పటికే లాగరాయి గ్రామంలో మహిళ మృతిచెందిన ఘటన జరిగింది.
మేం కారకులం కాదు..
లబ్బర్తి, లాగరాయి, కిండ్రలో ప్రజలు అనారోగ్యానికి గురికావడానికి కారకులం మేం అంటే మేం కాదు అంటూ వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది వంతు వేసుకుంటున్నారు. 3 గ్రామాల్లో ముందుగా ఒకరికి అనారోగ్యం వచ్చినప్పటికి మిగిలిన వారికి 3 నెలల వ్యవధిలో వ్యాప్తి చెందిందని, అనారోగ్యానికి గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, మందులు ఇవ్వడంలో వైద్యాధికారులు విఫలమయ్యరంటూ సర్పంచ్‌లు చెప్తున్నారు. అయితే గ్రామాల్లో పారిశుధ్య లోపం కారణంగానే అనారోగ్యమంటూ వైద్యాధికారులు వాదిస్తున్నారు.