సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:50 AM
తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేం దుకు జిల్లా పర్యటకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మధురపూడి ఎయిర్‌పోర్టులో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అఽధికారులు ఘనంగా స్వాగ తం పలికారు. నేరుగా మలకపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు చేరుకోవాల్సి ఉండగా వాతా వరణం బాగోక పోవడంతో ప్రత్యేక విమానం లో మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
రాజమహేంద్రవరం సిటీ/కోరుకొండ, జూలై 1(ఆంధ్రజ్యోతి): తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేం దుకు జిల్లా పర్యటకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మధురపూడి ఎయిర్‌పోర్టులో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అఽధికారులు ఘనంగా స్వాగ తం పలికారు. నేరుగా మలకపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు చేరుకోవాల్సి ఉండగా వాతా వరణం బాగోక పోవడంతో ప్రత్యేక విమానం లో మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మద్దిపాటి వెంకట్రాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్.. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కాన్వాయ్ ఎయిర్‌పోర్టు నుం చి బయలుదేరుతుండగా అక్కడకు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును చూసి వాహనం ఆపి పలుకరించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన చంద్రబాబు మలకపల్లి వెళ్లారు.
చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తాళ్లపూడి మండలం మలకపల్లి పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును మంగళవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మలకపల్లిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చించారు.