గంగలకుర్రు అగ్రహారంలో చైన్‌స్నాచింగ్
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:48 AM
అంబాజీపేట, జూన్ 4(ఆంధ్రజ్యోతి): దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న మహిళ మెడ లో మంగళసుత్రాలతో ఉన్న తాడును గుర్తుతెలియిన వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి లాక్కుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం
మహిళ మెడలో బంగారు సూత్రాలతాడు లాక్కెళ్లిన దుండగులు
అంబాజీపేట, జూన్ 4(ఆంధ్రజ్యోతి): దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న మహిళ మెడ లో మంగళసుత్రాలతో ఉన్న తాడును గుర్తుతెలియిన వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి లాక్కుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామంలో మంగళవారం శ్రీరావుల మ్మ తీర్థం జరిగింది. అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామానికి చెందిన దొమ్మేటి గంగాభవాని గంగలకుర్రు అగ్రహారం బంధువుల ఇంటికి వచ్చింది. మంగళవారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో హైస్కూల్ సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి చీక టి ప్రాంతంలో మోటార్‌సైకిల్ ఇద్దరు వ్యక్తులు వచ్చి మహిళ మెడలో ఉన్న సుమారు రూ.3 లక్షలు విలువైన 4 కాసుల బంగారు సూత్రాల తాడు దొంగలించుకుపోయారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు దొంగలను వెంబడించిన్నప్పటికి మోటార్‌సైకిల్‌పై పారిపోయారు. విషయాన్ని పోలీసులకు వివరించడంతో ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, ఎస్‌ఐ కె.చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు గంగాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.